టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). పవన్ కల్యాణ్ (Pawankalyan), రానా (Rana) కాంబినేషన్ లో వస్తున్న నటిస్తోన్న లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండగా…సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేస్తుండగా..రానా డానియల్ శేఖర్ (DANIELSHEKAR) పాత్ర పోషిస్తున్నాడు. కాగా మేకర్స్ డానియల్ శేఖర్ పరిచయం చేస్తూ వీడియోను విడుదల చేశారు.
నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట స్టేషన్ లో టాక్ నడుస్తోంది..నేనెవరో తెలుసా..? ధర్మేంద్ర హీరో అంటూ డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో కొత్తగా కనిపిస్తున్నాడు రానా. ఓ వైపు భీమ్లానాయక్, మరోవైపు డానియెల్ శేఖర్..ఈ ఇద్దరి పోటాపోటీ యాక్టింగ్ తో థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా అర్థమవుతోంది.
భీమ్లా నాయక్ చిత్రాన్ని 2022 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.ఎస్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఇప్పటికే అందరిలో ఫుల్ జోష్ నింపుతోంది.
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో వైరల్
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!