e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News ఇక‌ బిగ్ బాస్ 24 గంటలు స్ట్రీమింగ్.. OTTలో రోజంతా సందడే సందడి

ఇక‌ బిగ్ బాస్ 24 గంటలు స్ట్రీమింగ్.. OTTలో రోజంతా సందడే సందడి

ఇప్పటి వరకు బిగ్ బాస్ అంటే రోజుకు గంట సేపు ప్రసారం అయ్యేది. వీకెండ్ వ‌స్తే మరో అరగంట అదనం. ఒక్కోసారి రెండు గంటల ఎపిసోడ్ కూడా ప్లే చేస్తుంటారు. రోజంతా జ‌రిగే సంఘ‌ట‌న‌ల స‌మూహారాన్ని కేవ‌లం గంట‌కు కుదించి టెలికాస్ట్ చేస్తుండ‌టంతో ప‌లు విమ‌ర్శ‌లు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అక్క‌డ పాజిటివ్ జ‌రిగితే మ‌న‌కు నెగెటివ్ చూపిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు కూడా అదే మాట చెప్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో బిగ్‌బాస్ హౌస్‌లో జ‌రిగేది మొత్తం 24 గంట‌లు స్ట్రీమింగ్ చేస్తే ఎలా ఉంటుంది? గంట‌లోనే అన్ని ఎమోష‌న్స్ క‌నిపిస్తుంటే.. ఇక రోజంతా బిగ్‌బాస్ షో ప్ర‌సారమైతే ఇంకెలా ఉంటుందో క‌దా.. ఇప్పుడు బిగ్‌బాస్ షో నిర్వాహ‌కులు ఇదే చేయ‌బోతున్నారు.

బిగ్ బాస్ 15 హిందీ సీజన్ తొలి 6 వారాలు ఓటీటీలో ప్రసారం కానుంది. అది కూడా టీవీలో కంటే ముందుగానే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై విడుదల చేయబోతున్నారు. మళ్లీ అది కూడా గంటన్నర ఎపిసోడ్ కాదు.. 24 గంటలు స్ట్రీమింగ్. మొత్తం ముందుగానే ప్రసారం చేయబోతున్నారు. దీన్ని కరణ్ జోహార్ హోస్ట్ చేయబోతున్నాడు. టీవీలో వచ్చే ఎపిసోడ్స్ య‌థాత‌ధంగా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తాడు. కానీ డిజిటల్ మీడియాలో మాత్రం కరణ్ జోహార్ కనిపిస్తాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. వూట్ ఓటీటీ యాప్‌లో బిగ్ బాస్ 24 గంటల ప్రసారం కానుంది.

- Advertisement -

బిగ్ బాస్ గంట సేపు చూడటమే తలనొప్పిరా బాబూ అనుకుంటే.. 24 గంటలు వేస్తారా బాబోయ్ అనే వాళ్లున్నారు. అలాగే రోజంతా ఇచ్చినా కూడా బోర్ కొట్టకుండా చూస్తామనే వాళ్లు కూడా లేకపోలేరు. సభ్యులకు ఇచ్చే టాస్క్‌లను కూడా ప్రేక్షకులే నిర్ణయించే అవకాశాన్ని తీసుకున్నారు. ఈ షోను తొలి 6 వారాలు కరణ్ జోహార్ హోస్ట్ చేయనున్నాడు. ఆ 6 వారాలు మాత్రమే టెలికాస్ట్ చేయనున్నారు. ఆ తర్వాత అంతా టీవీలోనే గంటన్నర రానుంది. మరి ఇదే ప్లాన్ తెలుగులో కూడా తీసుకొస్తే భలే ఉంటుంది కదా..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

బ్ర‌హ్మాజీతో జాగ్ర‌త్త‌గా ఉండు.. నాగ‌శౌర్య‌కు రానా సూచ‌న‌

యషికా ఆనంద్ ఆరోగ్యం అత్యంత విషమం..!

రెయిన్ సాంగ్స్ కు నో అంటున్న ఇస్మార్ట్ భామ

‘నార‌ప్ప’ కొడుకు శీనప్ప రోల్ చేసింది ఎవ‌రో తెలుసా…?

పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?

జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!

త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంత‌కీ ఎవ‌రా వ్య‌క్తి.?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana