ఎప్పుడు ఏదో ఒక న్యూస్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంది ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రాంచరణ్ (Ram Charan), జూ..ఎన్టీఆర్ (Jr NTR) లీడ్ రోల్స్ లో నటించారు. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
జమ్మూకశ్మీర్‌లో భద్రతా కారణాల నేపథ్యంలో 1990 నుంచి థియేటర్లు మూతపడ్డాయి. మూడు దశాబ్దాల తర్వాత థియేటర్లు రీఓపెన్ అయ్యాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీనగర్ సిటీలోని శివ్పొర ప్రాంతంలో తొలి మల్టీప్లెక్స్ సినిమా థియేటర్‌ను ప్రారంభించారు. ఇక జమ్మూకశ్మీర్‌లో స్క్రీనింగ్ అయిన తొలి సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. మూడు దశాబ్దాల తర్వాత కశ్మీర్ లో తొలి సినిమా తెలుగుదే కావడం చాలా ప్రత్యేకం. ఈ అరుదైన ఘనతను ఆర్ఆర్ఆర్ దక్కించుకోవడం చారిత్రక సందర్బమనే చెప్పాలి.
ఇప్పటివరకు భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఆర్ఆర్ఆర్ ను థియేటర్లలో ఎంజాయ్ చేయగా..ఇపుడు కశ్మీరీ వాసులకు కూడా ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేసే అవకాశం దొరికింది. మరోవైపు తొలి రోజు స్క్రీనింగ్ అయిన హిందీ సినిమాగా భాగ్ మిల్ఖా భాగ్ గా నిలిచింది. కశ్మీర్లో మొదటి థియేటర్‌ను 1932లో లాల్ చౌక్ వద్ద భాయ్ అనంత్ సింగ్ గౌరీ ఏర్పాటు చేశారు. మొదట దీనికి కశ్మీర్ టాకీస్ పేరు పెట్టగా..ఆ తర్వాత ఈ పేరును పల్లాడియంగా మార్చారు.