మరికొన్ని రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమా గాడ్ ఫాదర్ (Godfather). మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓ డైలాగ్‌ను విడుదల చేసి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు చిరు.
‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు..’అంటూ చెప్పే డైలాగ్ ఆడియోను ట్వీట్ చేశాడు చిరు. రాజకీయాల నేపథ్యంలో చిరంజీవి చెప్తున్న ఈ సంభాషణలు విని ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టేసినట్టేనని తాజా ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేశాడు మెగాస్టార్. 10 సెక్లనపాటు ఉన్న ఈ డైలాగ్ ఇపుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్రలో నటిస్తున్నాడు. నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..సత్యదేవ్, పూరీ జగన్నాథ్ కీ రోల్స్ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2022