క్లాస్, మాస్, స్టైలిష్ సినిమాలతో ఇండియావైడ్‌గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఈ టాలెంటెడ్ స్టార్ హీరో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి చుప్ (Chup). ఆర్ బాల్కీ (R Balki) డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ కీ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది.
సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మేకర్స్ ప్రేక్షకుల కోసం రేపు 10 పట్టణాల్లో స్పెషల్ ఫ్రీ ప్రీమియర్స్ వేయనున్నట్టు ప్రకటించారు. స్పెషల్ ఫ్రీవ్యూ టికెట్స్ ఇవ్వడం ఇవాళ మధ్యాహ్నం షురూ కాగా..ఎంపిక చేసిన ప్రతీ థియేటర్లో అన్ని షోలకు టికెట్స్ (Chup Tickets) కేవలం నిమిషాల్లోనే అమ్ముడుపోయాయట. ప్రీవ్యూస్కు అద్బుతమైన రావడంతో..సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.
సీరియల్ కిల్లర్‌గా మారిన ఆర్టిస్ట్ ప్రతీకారం నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్టు ట్రైలర్ ద్వారా తెలిసిపోతుంది. శ్రేయాధన్వంతరీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..పూజాభట్ మరో కీ రోల్ చేస్తోంది. పెన్ స్టూడియోస్, హోప్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వివిధ భాషల్లో విడుదలవుతుంది.