మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. చిరు లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి గాడ్ ఫాదర్ (Godfather). మోహన్ రాజా (Mohan Raja) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. కాగా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి ఫిలింనగర్లో రౌండప్ చేస్తోంది.
గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ఈవెంట్ వేదిక ఫైనల్ అయిందట. తాజా అప్ డేట్ ప్రకారం అనంతపూర్‌లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో ఈవెంట్ జరుగనుంది. ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నట్టు టాక్. ఇక ప్రి రిలీజ్ ఈవెంట్ ఏ రోజు జరుగబోతుంది..చీఫ్ గెస్టు ఎవరు..ఇతర వివరాలపై త్వరలోనే మేకర్స్ స్పష్టత ఇవ్వనున్నారట. ఈవెంట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని టాక్.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సునీల్, సత్యదేవ్, నయనతారం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.