‘పువ్వుల్లో దాగున్న పళ్లెంతో అతిశయం..ఆ సీతాకోక చిలుక ఒళ్లెంతో అతిశయం..వేణువులో గాలి సంగీతాలే అతిశయం ‘..ఈ ఆల్ టైమ్ సూపర్ హిట్ ట్రాక్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జీన్స్ సినిమాలో హీరోయిన్ అందాలను పొగుడుతూ హీరో పాడే ఈ పాట సంగీత ప్రియుల్ని సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఇదే పాటను మూవీ లవర్స్‌కు గుర్తు చేసేలా ఉన్న కేరళ కుట్టి ఫొటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
ఇంతకీ ఆ భామ ఎవరనే కదా మీ డౌటు టాలెంటెడ్ మలయాళి భామ అమలాపాల్ (Amala Paul). ఓనం చీర (Onam sarees)లకు కేరళలో మాత్రమే కాకుండా సౌతిండియాలో చాలా క్రేజ్ ఉంటుందని తెలిసిందే. నెట్టింట్లో ఏదో స్టిల్‌తో కట్టిపడేసే ఈ సుందరి ఓనం సందర్భంగా దిగిన ఫొటోలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. అందమైన ఓనం చీరను ఒక్కసారైనా ధరించాలని చాలా మంది యువతులు, మహిళలు అనుకుంటారు. తాజాగా ఓనం చీరకట్టులో (Amala Paul Onam Look) దర్శనమిస్తూ..వాళ్లంతా అసూయ పడేలా చేస్తోంది అమలాపాల్.
బంగారపు వర్ణంలో బార్డర్ డిజైన్ ఉన్న సంప్రదాయ ఓనం చీరకట్టులో హొయలు పోతూ కెమెరాకు ఫోజులిచ్చింది అమలాపాల్. వికసించిన పూవులా మెస్మరైజ్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బెజవాడ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో మెరిసింది.
గతేడాది ఆంథాలజీ ప్రాజెక్టు పిట్టకథలు చిత్రంలో మెరిసింది. పెళ్లై, విడాకులైన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రొఫెషనల్ కెరీర్‌పై దృష్టి పెట్టింది అమలాపాల్.
നിങ്ങളുടെ ഓണസദ്യ പോലെ നിങ്ങളുടെ ജീവിതവും മികച്ചതായിരിക്കുമെന്ന് ഞാൻ പ്രതീക്ഷിക്കുന്നു! ❤️
ഹാപ്പി ഓണം! 🪷#HappyOnam pic.twitter.com/LI1TW8i1zX
— Amala Paul ⭐️ (@Amala_ams) September 8, 2022