ఆదివారం 31 మే 2020
Cinema - May 20, 2020 , 14:33:15

త‌న‌యుడి బ‌ర్త్‌డే వేడుక‌లో అన‌సూయ‌

త‌న‌యుడి బ‌ర్త్‌డే వేడుక‌లో అన‌సూయ‌

అందాల భామ అనసూయ‌కి సంబంధించి ఏ ఫోటో అయిన కొద్ది నిమిషాల‌లో వైర‌ల్ అవుతాయి. కొద్ది రోజుల క్రితం త‌న బ‌ర్త్‌డేకి సంబంధించిన ఫోటోల‌ని అన‌సూయ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఫుల్ వైర‌ల్ అయ్యాయి. తాజాగా త‌న త‌న‌యుడి బ‌ర్త్‌డే వేడుక‌ల‌కి సంబంధించిన ఫోటోల‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇంట్లో త‌యారు చేసిన కేక్‌ని త‌న‌యుడితో క‌ట్ చేయించిన‌ట్టు ఫోటోల‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. 

త‌న‌యుడి బ‌ర్త్‌డే వేడుక‌ల‌లోను అన‌సూయ ఫుల్ జోష్‌లో క‌నిపించింది. కుమారుడికి కేక్ తినిపిస్తూ మురిసిపోయింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, అవి ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. అన‌సూయ ..ఆచార్య సినిమాతో పాటు కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న రంగ‌మార్తాండ అనే చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తుంది. 
logo