రాష్ర్టానికి మరో రెండు నేషనల్ హైవేలు

- బాపుర్- మహబూబ్‌నగర్, గౌరెల్లి- కొత్తగూడెం
- మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసిన కేంద్రం
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరో రెండు జాతీయ రహదారులు మంజూరయ్యాయి. కర్ణాటకలోని బాపుర్- చించోలి- తెలంగాణలోని తాండూర్- కొడంగల్- మహబూబ్‌నగర్ మార్గాన్ని, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్‌ను ఆనుకొని ఉన్న అబ్దులాపూర్‌మెట్ మండలంలోని గౌరెల్లి నుంచి వలిగొండ మీదుగా కొత్తగూడెం వరకు మార్గాన్ని జాతీయ రహదారులుగా గుర్తిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు నేషనల్ హైవేలను భారత్‌మాల పరియోజనలో చేర్చినట్టు తెలిపింది. గౌరెల్లి- కొత్తగూడెం హైవే హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్ నుంచి మొదలై వలిగొండ, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, ఇల్లెందు మీదుగా కొత్తగూడెం వరకు ఉంటుంది. దీనివల్ల ఏజెన్సీ జిల్లాలైన మహబూబాబాద్, కొత్తగూడెం అభివృద్ధి చెందనున్నాయి. భద్రాచలం ఆలయానికి రవాణా సౌకర్యం మెరుగవనున్నది. కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌కు సంబంధించి హైవేల గుర్తింపు, విస్తరణ, ఇతర నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాజెక్టుల విలువ సుమారు రూ.6,100 కోట్లుగా తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

