Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మాలీవుడ్ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీని 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
కాగా పుష్ప 2 ది రూల్ ఆర్ఆర్ఆర్ బాటలో పయనిస్తుందన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ డాల్బీ విజన్ ఫార్మాట్ తొలి తెలుగు సినిమాగా నిలిచిందని తెలిసిందే. ఇప్పుడు సుకుమార్-బన్నీ ప్రాజెక్ట్ కూడా ఈ ఫార్మాట్లో సందడి చేయనుందని.. దీనికి సంబంధించి రీమాస్టరింగ్ పనులు కూడా జరుగుతున్నాయన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుతానికి డాల్బీ విజన్ స్క్రీన్స్ అందుబాటులో లేవు. కానీ ఇంటర్నేషనల్ మూవీ లవర్స్ మాత్రం పుష్పరాజ్ సందడిని డాల్బీ విజన్‌లో చూసి ఎంజాయ్ చేయొచ్చన్నమాట. మరి ఈ వార్తలపై మేకర్స్ రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. సీక్వెల్‌కు కూడా రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Kanguva | నా హీరోలకు లోపాలు చెబుతా కానీ.. సూర్య కంగువ నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా కామెంట్స్ వైరల్
Suraj Venjaramoodu | సింగిల్ షాట్లో 18 నిమిషాల సీన్.. విక్రమ్ వీరధీరసూరన్పై సూరజ్ వెంజరమూడు
Lucky Baskhar | దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ట్రైలర్ అప్డేట్ లుక్ వైరల్
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్