గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 28, 2020 , 09:24:58

బాహుబలి 2: ది కన్ క్లూజన్ @3

బాహుబలి 2: ది కన్ క్లూజన్ @3

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే స‌స్పెన్స్‌కి తెర తీసిన చిత్రం  బాహుబలి 2: ది కన్ క్లూజన్. 2015లో వ‌చ్చిన బాహుబ‌లి చిత్రానికి కొన‌సాగింపుగా తెర‌కెక్కిన ఈ చిత్రం అనేక రికార్డులు క్రియేట్ చేసింది. కేవ‌లం క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే ప్ర‌శ్న‌తోనే ఈ సినిమాపై ఎక్క‌డ లేని ఆస‌క్తి జ‌నాల‌లో పెరిగింది.  ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28,2017న‌ తేదీన విడుదల అయిన ఈ చిత్రం మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లోను ప్ర‌భంజ‌నం సృష్టించింది.

తెలుగు సినిమా కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ని ప‌తాక స్థాయికి చేర్చిన బాహుబలి 2: ది కన్ క్లూజన్ చిత్రం విడుద‌లై నేటితో మూడేళ్లు అవుతుంది. అయిన‌ప్ప‌టికీ ఆ చిత్రానికి సంబంధించిన జ్ఞ‌పకాలు ప్రేక్ష‌కుల మ‌దిలో ఫ్రెష్‌గా ఉన్నాయి. చిత్రంలో అమరేంద్ర బాహుబలి చనిపోయిన విదానాన్ని,మహేంద్ర బాహుబలి ఎల రాజుగా రాజ్యాన్ని ఎలుతాడో ఆస‌క్తిగా చూపించారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఓ అద్భుత విజువ‌ల్ వండ‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం బాహుబ‌లికి ముందు బాహుబ‌లి త‌ర్వాత అనే విధంగా రికార్డుల‌ని సెట్ చేసింది. మూడేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా 3YrsForMightyBaahubali2 అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్ట‌ర్‌లో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. 


logo