మంగళవారం 26 మే 2020
Cinema - May 22, 2020 , 23:22:56

ప్రభాస్‌ సినిమాలోకి ఆలియా భట్‌

ప్రభాస్‌ సినిమాలోకి ఆలియా భట్‌

సాహో చిత్రం తరువాత ప్రభాస్‌ ఒకే చిత్రానికి కాకుండా రెండు చిత్రాలకు ఒకే సమయంలో ప్లాన్‌ చేస్తున్నారు. సాహో చిత్రం లాభాల పరంగా హిట్‌ అయినప్పటికీ రికార్డుల పరంగా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో తన తదుపరి సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభాస్‌ వినూత్న కథలను ఎంచుకుని ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటున్నాడు. అందులో భాగంగానే వినూత్న చిత్రాల దర్శకులు రాధాకృష్ణతో పాటు మహానటి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నాగ్‌ అశ్విన్‌లతో కలిసి పని చేస్తున్నారు.

అందుకు తగ్గట్టు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ చిత్రంలో బాలివుడ్‌ ముద్దుగుమ్మ ఆలియా భట్‌ను భారీ రెమ్యునరేషన్‌ ఇచ్చి తీసుకుంటున్నట్లు తెలిసింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌లో అశ్వినీ దత్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఆలాయా భట్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోనూ నటిస్తుంది. తెలుగులో ఆలియా భట్‌కు కూడా మంచి అభిమానులు ఉన్నారు. చూడాలి ఆలియాను ఈ రెండు చిత్రాల్లో తెలుగు అభిమానుల ముందుకు ఎవరు ముందు తెస్తారని. logo