Alia Bhatt | ‘బాహుబలి’, ‘బాహుబలి-2’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి (SS Rajamouli). టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్.. రాజమౌళి చిత్రంలో ఆఫర్ కోసం ఎదురు చూస్తుంటారు. ఆయనతో సినిమా చేయడం ఓ డ్రీమ్‌గా భావిస్తుంటారు. అంతటిగొప్ప దర్శకుడు తాజాగా ఓ అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. 2023కు గానూ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ (Time magazine) రిలీజ్ చేసిన ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2023’ (100 most influential people of 2023) జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ (Alia Bhatt).. రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనతో పనిచేయడం అంటే మళ్లీ స్కూల్‌కు వెళ్లడంతో సమానమని అన్నారు.
‘‘బాహుబలి 2’ ప్రివ్యూలో నేను ఎస్ఎస్ రాజమౌళిని మొదటిసారి కలిశాను. సినిమా చూస్తున్నంతసేపు ఆశ్చర్యపోయాను. ఎలాగైనా ఆయన దర్శకత్వంలో నటించాలని అనుకున్నా. ‘ఆర్ఆర్ఆర్’తో ఆ కల నెరవేరింది. రాజమౌళి దగ్గర పని చేయడం అంటే మళ్లీ స్కూల్‌కు వెళ్లడంతో సమానం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మరెన్నో కొత్త అంశాలు తెలుసుకోవచ్చు. నేను ఆయన్ని మాస్టర్ స్టోరీటెల్లర్ అని పిలుస్తా. ఆయన ఒక కథను ఎంతో అద్భుతంగా తెరకెక్కించగలరు. తన సినిమాల ద్వారా అందరినీ ఒక చోటుకు చేర్చుతారు. నటన పరంగా ఏదైనా సలహా ఇవ్వమని ఆయన్ని అడిగాను. ‘ఏ క్యారెక్టర్ లో నటించినా.. ప్రేమతో చేయాలి’ అని రాజమౌళి చెప్పారు. సినిమా పెద్దగా ఆడకపోయినా.. మనం చేసిన పాత్ర జనాలకు గుర్తుండిపోయేలా నటించాలని సూచించారు’ అని ఆలియా చెప్పుకొచ్చారు.
2023కు గానూ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ (Time magazine) రిలీజ్ చేసిన ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2023’ (100 most influential people of 2023) జాబితాలో రాజమౌళి చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌కు కూడా చోటు దక్కింది. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి వీరిద్దరికే ఈ అవకాశం దక్కడం విశేషం.
Also Read..
Shah Rukh Khan – SS Rajamouli | రాజమౌళి, షారుక్‌కు అరుదైన ఘనత
Pooja Hegde | సల్మాన్‌తో డేటింగ్.. బుట్టబొమ్మ రియాక్షన్ ఇదీ..
Toque monkeys | శ్రీలంక నుంచి చైనాకు లక్ష కోతుల ఎగుమతి.. కారణమిదే!