Pooja Hegde | సల్మాన్‌తో డేటింగ్.. బుట్టబొమ్మ రియాక్షన్ ఇదీ..
Pooja Hegde | టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde), బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డేటింగ్ రూమర్స్ (Dating Rumours)పై తాజాగా నటి స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది.
Pooja Hegde | టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde), బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan)’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడిందని.. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పలు వెబ్సైట్లలో సైతం కథనాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో డేటింగ్ రూమర్స్ (Dating Rumours)పై తాజాగా నటి స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ‘సల్మాన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నా. ఎవరితోనూ ప్రేమలో లేను. ప్రస్తుతం దృష్టంతా నా కెరీర్‌పైనే పెట్టా’ అంటూ చెప్పుకొచ్చింది.
సల్మాన్, పూజా హెగ్దే కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan)’. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన ‘వీరమ్’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. తెలుగులో ‘వీరుడొక్కడే’ పేరుతో డబ్బింగ్ అయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఫర్హాద్ షంజీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు దేవి ప్రసాద్, రవి బస్రూర్, హిమేశ్ రేషమ్మియా సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్, జగపతిబాబు, షెహ్నాజ్ గిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
Also Read..
Toque monkeys | శ్రీలంక నుంచి చైనాకు లక్ష కోతుల ఎగుమతి
India Corona | డేంజర్ బెల్స్.. 11 వేలకు పైనే కొత్త కేసులు.. 29 మరణాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

