Toque monkeys | శ్రీలంక నుంచి చైనాకు లక్ష కోతుల ఎగుమతి.. కారణమిదే!
Toque monkeys | తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక (Sri Lanka) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతరించిపోతున్న ఓ రకం జాతికి చెందిన కోతులను ( monkeys) చైనా (China)కు ఎగుమతి (Export) చేసేందుకు సిద్ధమైంది.
Toque monkeys | తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక (Sri Lanka) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతరించిపోతున్న ఓ రకం జాతికి చెందిన కోతులను ( monkeys) చైనా (China)కు ఎగుమతి (Export) చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తమ దేశం నుంచి లక్ష కోతులను చైనాకు తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు శ్రీలంక తాజాగా వెల్లడించింది. టోక్ మకాక్ కోతులను (Toque macaque monkeys) పంపించాలని చైనా చేసిన ప్రతిపాదనను అధ్యయనం చేయాలంటూ శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర (mahinda amaraweera) తమ శాఖ అధికారులను ఆదేశించారు.
చైనాలోని వెయ్యి జంతు ప్రదర్శనశాలకు డ్రాగన్ దేశం లక్ష కోతులను కోరినట్లు మంత్రి మహింద అమరవీర తెలిపారు. తమ దేశంలో ఈ కోతుల సంఖ్య అధికంగా ఉన్నందున.. డ్రాగన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. కోతుల ఎగుమతి విషయంలో న్యాయపరమైన చిక్కులేమైనా ఉంటాయా? అనే విషయాన్ని అధ్యయనం చేసేందుకు కేబినెట్ అనుమతితో ఓ కమిటీని నియమించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
‘టోక్ మకాక్’ జాతి కోతులు శ్రీలంకలో మాత్రమే కనిపిస్తాయి. ఇవి అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో టోక్ మకాక్ కోతుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు అంచనా. ఇవి స్థానికంగా పంటలను దెబ్బతీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటి సంతతిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేదని, ఈ క్రమంలోనే చైనా నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు వాటిని ఎగుమతి చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే వాటిని ఉచితంగా ఇస్తారా..? లేక కొనుగోలు ఒప్పందం చేసుకుంటారా..? అన్న విషయంపై క్లారిటీ లేదు.
Also Read..
Shah Rukh Khan – SS Rajamouli | రాజమౌళి, షారుక్‌కు అరుదైన ఘనత
India Corona | డేంజర్ బెల్స్.. 11 వేలకు పైనే కొత్త కేసులు.. 29 మరణాలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

