టాలీవుడ్ నటుడు అక్కినేని సుమంత్ రెండో పెళ్లికి సిద్దమవుతున్నట్టు ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. సుమంత్ కుమార్ వెడ్స్ పవిత్ర వివాహానికి ఇదే మా ఆహ్వానం అంటూ ఓ వెడ్డింగ్ కార్డు బయటకు రావడంతో సుమంత్ పెండ్లి పీటలెక్కుతున్నాడని అందరూ తెగ చర్చించుకుంటున్నారు. సుమంత్ రెండో పెళ్లిపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ..మొదటి పెళ్లి విఫలమైన తర్వాత కూడా సుమంత్ తెలివైనవాడు కాదని ఆర్జీవీ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో పెళ్లి వార్తలపై సుమంత్ స్పందించాడు. తాను పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు. నేను విడాకుల నేపథ్యంలో వస్తోన్న సినిమాలో నటిస్తున్నా. సినిమాకు సంబంధించిన వెడ్డింగ్ కార్డు బయటకు లీకై నా పెళ్లి గురించి అందరిలో అయోమయాన్ని సృష్టించింది. కానీ నేను రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకోను అంటూ పుకార్లకు చెక్ పెట్టాడు. సుమంత్ ప్రస్తుతం అనగనగా ఒక రౌడీ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో వాల్తేరు శీను అనే పక్కా మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు.
🙏🏼 Just clearing the air, for those who are interested, and for dear @RGVzoomin who has such immense concern for me 😊 https://t.co/ROrftZaadc pic.twitter.com/TS72kbdNA8
— Sumanth (@iSumanth) July 29, 2021
ఇవి కూడా చదవండి..
రూ.25 లక్షలు గెలుచుకున్న రాంచరణ్
‘రామారావు’తో వేణు గ్రాండ్ కమ్‌బ్యాక్
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..