Flora Saini | నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలతో పాపులర్ అయిన నటి ఫ్లోరా సైనీ ( ఆశా సైనీ ) సంచలన ఆరోపణలు చేసింది. ప్రముఖ నిర్మాత తనను చిత్రహింసలకు గురిచేశాడని.. 14 నెలల పాటు తనకు నరకం చూపించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది.
ఓ ప్రముఖ నిర్మాతను ప్రేమించా. కానీ కొద్దిరోజుల్లోనే పరిస్థితులు మారిపోయాయి. అతనిలోని అసలు వ్యక్తి బయటపడ్డాడు. నాతో దారుణంగా ప్రవర్తించేవాడు. నా ముఖం, ప్రైవేటు భాగాలపై ఇష్టమొచ్చినట్టు కొట్టేవాడు. ఎవరితో మాట్లాడకుండా ఉండేందుకు నా దగ్గర నుంచి ఫోన్ కూడా లాక్కున్నాడు. 14 నెలల పాటు ఎవరితోనూ మాట్లాడినవ్వలేదు. యాక్టింగ్ మానేయాలని చిత్రహింసలు పెట్టేవాడు. కానీ ఓ రోజు అతని నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో పేర్కొంది. అతని నుంచి పారిపోయి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చానని తెలిపింది. ఆ నరకయాతన నుంచి కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పట్టిందని చెప్పింది. ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని ఆ వీడియోలో కొన్ని ఫొటోలను కూడా చూపించింది. అయితే ఆ నిర్మాత ఎవరనేది మాత్రం ఎక్కడా చెప్పలేదు.
1999లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఆశా సైనీ.. తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది. నరసింహ నాయుడు సినిమాలో లక్స్ పాప.. లక్స్ పాప అంటూ బాలకృష్ణతో స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ తర్వాత ఆశా సైనీ కెరీర్ ఊపందుకుంటుందేమో అనుకున్నారు కానీ లాభం లేకపోయింది. దీని తర్వాత నువ్వు నాకు నచ్చావ్ సినిమా మాత్రమే కాస్త గుర్తింపు తెచ్చింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ చిత్రాల్లోనూ అదృష్టం పరీక్షించుకుంది. కానీ సక్సెస్ కాలేదు. దీంతో బాలీవుడ్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది.
Tarakaratna | ఐసీయూలో నందమూరి తారకరత్న.. వైరల్ అవుతున్న ఫొటో
RRR | అవార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా ఆర్ఆర్ఆర్.. ఖాతాలో మరో పురస్కారం