e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News ఉద్యోగం నుంచి వైదొలిగితే ఈపీఎఫ్‌పై వ‌డ్డీ వ‌స్తుందా?!

ఉద్యోగం నుంచి వైదొలిగితే ఈపీఎఫ్‌పై వ‌డ్డీ వ‌స్తుందా?!

ఉద్యోగం నుంచి వైదొలిగితే ఈపీఎఫ్‌పై వ‌డ్డీ వ‌స్తుందా?!

న్యూఢిల్లీ: చాలా మంది ఒక సంస్థ నుంచి మ‌రో సంస్థ‌లో ఉద్యోగంలో చేరిన‌ప్పుడు త‌మ ఈపీఎఫ్ ఖాతాను నూత‌న యాజ‌మాన్యానికి బ‌దిలీ చేయ‌డం త‌రుచుగా మ‌రిచిపోతుంటారు. అత్య‌ధికులు త‌మ ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్‌తో 58 ఏండ్ల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు ప‌న్ను రాయితీ వ‌డ్డీ వ‌స్తూనే ఉంటుంద‌ని న‌మ్ముతుంటారు.

కనుక వారు త‌మ ఈపీఎఫ్ ఖాతాలోని సొమ్మును నూత‌న యాజ‌మాన్యంలోకి బ‌దిలీ చేయ‌రు. అలాగ‌ని మొత్తం ఈపీఎఫ్ విత్ డ్రా చేసుకో‌రు.

కొంద‌రు 58 ఏండ్ల వ‌య‌స్సుకు ముందు సొంత వ్యాపారం ప్రారంభించేందుకు ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. అప్పుడు త‌రుచుగా త‌మ ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ మొత్తం గురించి తెలుసుకోవ‌డానికి ప్రాధాన్యం ఇస్తారు.

కొత్త‌గా ఉద్యోగం పొందినా, పాత ఈపీఎఫ్ ఖాతాలో ఫ్రెష్ కంట్రిబ్యూష‌న్ లేకపోయినా 58 ఏండ్ల వ‌ర‌కు ప‌న్ను రాయితీతో కూడిన వ‌డ్డీ ల‌భిస్తుంద‌ని భావిస్తుంటారు. అయితే, 58వ ఏట రిటైర‌య్యే వ‌ర‌కు, లేదా ఉద్యోగం నుంచి వైదొలిగే వ‌ర‌కు ఈపీఎఫ్ మొత్తం ప‌న్ను విధించ‌రు.

కానీ రిటైరైనా, ఉద్యోగానికి రాజీనామా చేసినా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌పై వ‌చ్చే వ‌డ్డీ మీద మాత్రం ప‌న్ను విధిస్తారు. 58 ఏండ్ల లోపు రాజీనామా చేసిన‌ట్లయితే, ఆ త‌ర్వాత 36 నెల‌ల్లో ఈపీఎఫ్ కోసం క్ల‌యిమ్ చేయాలి. లేక‌పోతే ఇన్ ఆప‌రేటివ్ ఖాతాగా నిర్ణ‌యిస్తారు.

ఈపీఎఫ్ ఖాతా ఇన్ ఆప‌రేటివ్‌గా మారితే త‌దుప‌రి వ‌డ్డీ ల‌భించ‌దు. ఉద్యోగానికి రాజీనామా చేసిన రెండు నెల‌ల్లో సంబంధిత వ్య‌క్తి త‌న ఈపీఎఫ్ మొత్తం విత్ డ్రా చేసుకునేందుకు అర్హులు.

ఈపీఎఫ్‌వో నిబంధ‌న‌ల ప్ర‌కారం నాలుగు సంద‌ర్భాల్లో ఈపీఎఫ్ ఖాతా ఇన్ ఆప‌రేటివ్ అని నిర్ణ‌యిస్తారు. 55 ఏండ్ల త‌ర్వాత రిటైరైనా.. స‌బ్‌స్క్రైబ‌ర్ శాశ్వ‌తంగా విదేశాల‌కు వెళ్లినా, మ‌ర‌ణించినా, రాజీనామా చేసిన 36 నెల‌ల్లో క్ల‌యిమ్ చేయ‌కున్నా ఇన్ ఆప‌రేటివ్ ఖాతాగా నిర్ణ‌యిస్తారు.

క‌నుక ఈపీఎఫ్ ఖాతాదారులు.. తాము ఒక సంస్థ నుంచి మ‌రో సంస్థ‌కు మారితే.. త‌మ ఖాతాను బ‌దిలీ చేసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు.. అలాకాక , 58 ఏండ్ల ముందే రిటైరైతే.. ఉద్యోగానికి రాజీనామా చేసిన 36 నెల‌ల్లోపు ఈపీఎఫ్ ఖాతాలో సొమ్ము విత్ డ్రా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం కూడా మరిచిపోవ‌ద్ద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

పెట్రో సెగ‌ల‌తో ధ‌ర‌ల మంట

కొవిడ్‌పై పోరు.. ఫ్రీగా ఆక్సిజ‌న్ పంపిస్తున్న ముకేశ్ అంబానీ

ఇస్రో సైంటిస్టు అరెస్టు.. సీబీఐ విచార‌ణ‌కు ఆదేశం

‘మోటో’లవర్స్‌ కి గుడ్‌ న్యూస్‌

ఆర్‌బీఐ అలర్ట్‌.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్‌టీజీఎస్‌ సేవలు

ఎగుమతి చేసిన చేతితోనే..

ఇన్ఫీ లాభం 5,076 కోట్లు

మార్కెట్లోకి హైబ్రిడ్‌ ట్రాక్టర్‌

ఎల్‌ఐసీ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌!

వాట్సాప్‌లో ఈ ట్రిక్స్‌ తెలుసా?

బైడెన్‌ ఎఫెక్ట్‌ : భారత టెక్‌, ఫార్మా కంపెనీలపై పన్ను భారం

ఏప్రిల్ 20న వ‌స్తున్న యాపిల్ కొత్త ప్రోడ‌క్ట్స్ ఇవే..

15 నెల‌ల్లో ఈ ఐఐటీయ‌న్ సంప‌దెంతంటే!

ఫ్లిప్‌కార్ట్ చేతికి క్లియ‌ర్ ట్రిప్

ఆదాయంలో అంచ‌నాలు దాటిన విప్రో

ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. 36 పరుగులకే 3 వికెట్లు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉద్యోగం నుంచి వైదొలిగితే ఈపీఎఫ్‌పై వ‌డ్డీ వ‌స్తుందా?!

ట్రెండింగ్‌

Advertisement