Why Planes Crash | గుజరాత్ అహ్మదాబాద్‌లో టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానం AI-171 కూలిపోయింది. ఈ ప్రమాదంలో సిబ్బందితో పాటు ప్రయాణికులు మొత్తం 242 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనతో విమానాల్లో ప్రయాణికులు భద్రత, సాంకేతిక లోపాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, చాలామంది విమాన ప్రయాదాలు ఎందుకు జరుగుతాయని ఆలోచిస్తుంటారు. ఇందుకు నాలుగు ప్రధాన కారణాలున్నాయి. ఇందులో ఒకటి సాంకేతిక లోపాలు. విమానాలు కూలిపోవడం అనేది సాంకేతిక లోపాల కారణంగానే ఎక్కువగా జరుగుతుంటాయి. ఇంజిన్ విఫలమవడం, నావిగేషన్ సిస్టమ్ దెబ్బతినడం, ల్యాండింగ్ గేర్, రెక్కల్లో సమస్యలు ఎదురుకావడం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. దాంతో విమానం కూలిపోయే అవకాశం ఉంటుంది. ఇక రెండో కారణం మానవ తప్పిదాలు. విమాలు ప్రమాదాలు సాంకేతిక సమస్యలతో కాకుండా మానవ తప్పిదాలతోనూ జరుగుతుంటాయి.
Read Also : Plane Crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం..! బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ భద్రతపై ప్రశ్నలు..!
చాలా సార్లు పైలట్ తప్పిదం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో నిర్లక్ష్యం కారణంగా విమానాలు కూలిపోయిన ఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా చాలాసార్లు విమానాలు నడిపే పైలట్లకు అనుభవం లేకపోవడం వల్ల.. వారు తీసుకునే తప్పుడు నిర్ణయాలతోనూ విమానాలు కూలిపోయే అవకాశాలుంటాయి. ఇక సాంకేతిక సిబ్బంది చేసిన తప్పు ల కారణంగా సైతం విమానాలు కూలిపోతుంటాయి. విమానంలో సరిగ్గా ఇంధనం నింపకపోవడం, టైర్ ఒత్తిడిని పర్యవేక్షించకపోవడం తదితర కారణాలతోనూ విమానం కూలిపోయే అవకాశాలు భారీగానే పెరుగుతాయి. అలాగే, పైలట్-కంట్రోల్ రూమ్ మధ్య కమ్యూనికేషన్ కోల్పోవడం కూడా విమాన ప్రమాదానికి దారితీస్తుంది. ఇక నాలుగో కారణం వాతావరణం. విమాన ప్రమాదాల్లో వాతావరణం పాత్ర కూడా ఉంటుంది. బలమైన తుఫానులు, మెరుపులు, భారీ వర్షం, వాతావరణంలో అల్లకల్లోలం కారణంగా, విమానం నియంత్రణ కోల్పోయి ప్రమాదం బారినపడే అవకాశాలుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.