Plane Crash | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఎయిర్ ఇండిమా విమానం ప్రమాదానికి గురైంది. లండన్‌లోని గాట్విక్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-171 కుప్పకూలింది. ఇది బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే అదుపు తప్పింది. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం తర్వాత సంఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఈ విమానాలు వివాదాల్లో కూరుకుపోయాయి. ఉత్పత్తి ప్రక్రియ.. నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలో ఫ్యూజ్‌లేజ్ షిమ్మింగ్, స్కిన్ సర్పేసింగ్ సమస్యలపై పలువురు ఇంజినీర్లు ఆరోపణలు వ్యక్తం చేశారు. బోయింగ్ అక్రమాలకు పాల్పడుతోందంటూనే,.. విమానాల తయారీలో షార్ట్‌కట్స్ వైఫల్యాలపై హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో 2020లో అనేక బోయింగ్ 787 విమానాలను ఫ్యూజ్‌లేజ్ షిమ్మింగ్ స్కిన్ సర్ఫేసింగ్ సహా నాణ్యత నియంత్రణల సమస్యల కారణంగా గ్రౌండింగ్ చేశారు. బోయింగ్ ఇంజినీర్ సామ్ సలేహ్‌పూర్ 787, 777 రెండింటిలోనూ తయారీ షార్ట్‌కట్స్, తయారీ వైఫల్యాలపై హెచ్చరికలు చేశారు. ఆయా సమస్యలు విమానాల వయసు పెరిగే కొద్ది ప్రమాదాల బారినపడే అవకాశాలుంటాయని హెచ్చరించారు. విజిల్‌బ్లోయర్ వాదనలపై ఎఫ్ఏఏ సైతం దర్యాప్తు చేశారు. 787 నిర్మాణాన్ని ప్రభావితం చేసే ఏరోస్పేస్ -గ్రేడ్ టైటానియం మిశ్రమం బదులుగా స్టాండర్డ్ టైటానియం తదితన పదార్థాలను వినియోగిస్తున్నట్లు ఎఫ్ఏఏ గుర్తించింది.
787 డ్రీమ్‌లైనర్ ఉత్పత్తిలో బోయింగ్ అనేక సమస్యలను ఎదుర్కొంది. ప్రధాన సమస్యల్లో ఒకటి దాని సరఫరా గొలుసు, ఉత్పత్తి ప్రక్రియలో జాప్యం. అలాగే, బోయింగ్ విమానం ఈ మోడల్లోని భాగాలకు నాణ్యత నియంత్రణ లేదని తేలింది. దాంతో భద్రతా సమస్యలను లేవనెత్తింది. భద్రతా సమస్యల కారణంగా, విమానం భద్రత, నాణ్యతను ప్రశ్నించిన నియంత్రణ సంస్థల నుంచి బోయింగ్ దర్యాప్తులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ వివాదాలు బోయింగ్‌కు ఆర్థిక నష్టాలను తీసుకువచ్చాయి. అదే సమయంలో కంపెనీ ప్రతిష్టను సైతం ప్రభావితం చేశాయి. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ జెట్ చుట్టూ ఉన్న వివాదం విమానయాన పరిశ్రమలో నాణ్యత నియంత్రణ, ఉత్పత్తి ప్రక్రియల ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. బోయింగ్ ఈ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంది. కానీ, వివాదం కంపెనీ ప్రతిష్ట, ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసింది.