Air India Plane Crash | ఇప్పటి వరకు భారత్‌లో జరిగిన విమాన ప్రమాదాలు ఇవే.. 1988 అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో 133 మంది మృతి..!

Air India Plane Crash | గుజరాత్‌ అహ్మదాబాద్‌లో గురువారం ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం కూలిపోయింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపట్లోనే విమానం పడిపోయింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు విమానంలో సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరింది.