గురువారం 03 డిసెంబర్ 2020
Business - Aug 22, 2020 , 00:04:17

యూనియన్‌ బ్యాంక్‌ లాభం రూ.333 కోట్లు

యూనియన్‌ బ్యాంక్‌ లాభం రూ.333 కోట్లు

హైదరాబాద్‌: ఈ ఏప్రిల్‌-జూన్‌లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం రూ.332.74 కోట్లుగా నమోదైంది. ఏకీకృత నికర లాభం రూ.340.95 కోట్లుగా ఉన్నది. మొత్తం ఆదాయం రూ.19,89 1.26 కోట్లుగా ఉన్నట్లు శుక్రవారం బ్యాంక్‌ తెలియజేసింది. నికర వడ్డీ ఆదాయం రూ.6,403.19 కోట్లుగా, నిర్వహణపరమైన లాభం రూ.4,034.09 కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి యూనియన్‌ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌లు విలీనమైనది తెలిసిందే.