Donald Trump | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. రష్యా చమురు కొనుగోలు కారణంతో న్యూఢిల్లీపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 25 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చింది. ఆగస్టు 27 నుంచి మిగతా 25 శాతం టారిఫ్ అమలులోకి రానుంది. అయితే, ట్రంప్ నిర్ణయంతో దిగుమతి చేసుకునే బంగారు (gold imports) కడ్డీలపై సుంకాల పెంపు వర్తిస్తుందా? లేదా? అనే విషయంపై సందిగ్ధత (Customs Confusion) నెలకొంది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ‘బంగారం’ లాంటి వార్త చెప్పారు. బంగారం దిగుమతులపై అదనపు సుంకాలు ఉండవని స్పష్టం చేశారు.
ఒక కేజీతోపాటు 100 ఔన్సుల (2.8 కిలోల) బంగారు కడ్డీలు సుంకాల పరిధిలోకి వస్తాయని అమెరికా కస్టమ్స్ అధికార వర్గాలు ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే. ఈమేరకు జులై 31న ఓ ప్రకటన విడుదల చేశారు. అదే సమయంలో గోల్డ్ బార్లపై సుంకాల విధింపుపై ట్రంప్ క్లారిటీ ఇస్తూ త్వరలోనే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేస్తారని వైట్‌హౌస్ అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ విషయంలో గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో పసిడి ధరలు కూడా అమాంతం పెరిగాయి. దీంతో ట్రంప్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు బంగారంపై సుంకాలు విధించబోమంటూ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. ‘బంగారంపై సుంకాలు ఉండవు’ అని రాసుకొచ్చారు.
Also Read..
మళ్లీ 80 వేల పైకి సెన్సెక్స్.. భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు
సింగరేణి భూగర్భ గనుల్లో భారీ నష్టాలు