ముంబై, మే 21: బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. మంగళవారం బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. మార్కెట్ క్యాప్ ఇంతటి గరిష్ఠ స్థాయికి చేరుకోవడం దేశీయ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంట్రాడేలో 5.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న బీఎస్ఈలోని సంస్థల విలువ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి రూ.4,14,62,306.56 కోట్లు(4.97 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోనే గడిచిన ఐదు నెలల్లోనే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ 633 బిలియన్ డాలర్లు పెరిగింది.
ఈ ఏడాది ప్రారంభంలో 4.14 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ విలువ ప్రస్తుతం 5 లక్షల కోట్ల డాలర్లు అధిగమించింది. 2024 ప్రారంభం నుంచి ఇప్ప టి వరకు సెన్సెక్స్ 2.3 శాతం రిటర్నులు పంచింది. కానీ బీఎస్ఈ మిడ్‌క్యాప్ 16 వాతం పంచగా, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 11 శాతం రిటర్నులు పంచింది. కేవలం ఆరు నెలల్లోనే 4 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. నవంబర్ 29, 2023లో 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 52.63 పాయింట్లు నష్టపోయి 74 వేల పాయింట్ల దిగువకు 73,953.31 వద్ద ముగిశాయి.
