Bigg Boss 9 |బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు 12వ వారంలోకి ప్రవేశించగా, మరో మూడు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్స్ ఘర్షణాత్మకంగా సాగగా, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్‌లు హౌస్‌లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. కెప్టెన్సీ కంటెండర్‌ను సెలక్ట్ చేయడానికి బిగ్ బాస్ ఈ సారి వినూత్నంగా పాత సీజన్ల కంటెస్టెంట్లను రంగంలోకి దింపాడు. కెప్టెన్సీ కోసం మొదటి కంటెండర్‌ను ఎంపిక చేయడానికి మాజీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆమెను ఆకట్టుకునేందుకు అందరూ ప్రయత్నించినా, చివరికి ప్రియాంక పవన్ కళ్యాణ్‌ను ఎంపిక చేసింది. ఇద్దరి మధ్య జరిగిన టాస్క్‌లో పవన్ విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు.
రెండో కంటెండర్ ఎంపిక కోసం సీజన్ 8 రన్నర్ గౌతమ్ హౌస్‌లోకి వచ్చాడు. వచ్చిన వెంటనే హౌస్‌ను లవర్స్ పార్క్‌గా మార్చి, ప్రత్యేక ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టాడు. కంటెస్టెంట్స్ ప్రపోజ్ చేసి గౌతమ్‌ను ఇంప్రెస్ చేయాల్సి ఉండగా, అందరూ తమదైన శైలిలో పర్ఫార్మ్ చేశారు. భరణి సంజనాకు ప్రపోజ్ చేయగా, మధ్యలో సుమన్ శెట్టి వచ్చి చేతిపై ముద్దు పెట్టి సర్ప్రైజ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ రీతూను ఇంప్రెస్ చేస్తే, డీమాన్ పవన్ రియాక్షన్స్ నవ్వులు పూయించాయి. ఇమ్మాన్యుయోల్ తన కామెడీ టైమింగ్‌తో ఈ టాస్క్‌ను హైలైట్ చేశాడు. చివరకు గౌతమ్ కెప్టెన్సీ కంటెండర్‌గా భరణినే సెలక్ట్ చేశాడు. ఇద్దరూ టాస్క్‌ను హోరాహోరీగా ఆడినా, గౌతమ్ స్పీడ్ ముందు భరణి నిలబడలేకపోయాడు. టాస్క్ ఓడిపోయిన భరణి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. హౌస్‌లోకి వచ్చిన తన కూతురు “నాన్నా ఒక్కసారి కెప్టెన్ అవ్వు” అని చెప్పిన మాటలు గుర్తుకురావడంతో అతను భావోద్వేగానికి గురయ్యాడు. ఇతర హౌస్మేట్స్ భరణిని ఓదార్చారు.
వచ్చిన పని పూర్తి చేసిన గౌతమ్ బయటకు వెళ్తూ బిగ్ బాస్‌కు థ్యాంక్స్ చెప్పాడు. ప్రతి సీజన్లో కూడా తనను ఇలాగే పిలవాలని రిక్వెస్ట్ చేస్తూ హౌస్‌ను వీడాడు. బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే దగ్గరపడుతున్న క్రమంలో కెప్టెన్సీ టాస్క్‌లు, పాత కంటెస్టెంట్ల రీఎంట్రీలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.