బెంగళూరు, నవంబర్ 25: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సునీల్ కుమార్ చుగ్ నియమితులయ్యారు. మూడేండ్లపాటు ఈ పదవిలో ఉండనున్న ఈ నియామకం వెంటనే అమలులోకి రానున్నట్టు బ్యాంక్ వెల్లడించింది.
ఆయన గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా ఆయనకు అనుభవం ఉన్నది.