న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశవ్యాప్తంగా డాటా సెంటర్లకు అత్యధిక ఆదరణ లభిస్తున్నది. దీంతో ఈ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి కార్పొరేట్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. 2025-26 నుంచి 2027-28 వరకు డాటా సెంటర్లలోకి రూ.55 వేల నుంచి రూ.60 వేల కోట్ల స్థాయిలో పెట్టుబడులు పెట్టే ఆలోచనలో డాటా సంస్థలు ఉన్నట్టు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేస్తున్నది.
దీంతో డాటా సెంటర్ల సామర్థ్యం రెండింతలు పెరిగి 2.3-2.5 గిగావాట్లకు చేరుకోనున్నదని తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అలాగే వచ్చే మూడేండ్లలో డాటా సెంటర్లు నిర్వహిస్తున్న సంస్థల నికర ఆదాయం రూ.20 వేల కోట్ల స్థాయిలో ఉండనున్నదని క్రిసిల్ రేటింగ్ అసోసియేట్ డైరెక్టర్ నితిన్ బన్సాల్ తెలిపారు.