Stock Market | భారత బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సూచీలు మంగళవారం పొద్దంతా అస్థిరతకు గురయ్యాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,349.28 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత కోలుకొని.. కొద్దిసేపటికే మళ్లీ పతనమయ్యాయి. ఇలా పొద్దంతా పడుతూ లేస్తూ వచ్చాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒక దశలో 81,230.44 పాయింట్ల కనిష్ఠానికి చేరుగా.. గరిష్ఠంగా 81,815.27 పాయింట్లకు పెరిగింది. చివరకు 99.55 పాయింట్ల లాభంతో 81,455.40 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం 21.22 పాయింట్ల వద్ద 24,857.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,074 షేర్లు పెరగ్గా.. 1,378 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో బీపీసీఎల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. సిప్లా, ఎల్‌టీఐఎండ్‌ట్రీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు పవర్, రియాల్టీ, ఆటో 0.5-1 శాతం వృద్ధితో లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.9 శాతం వృద్ధిని నమోదు చేశాయి.