Singapore flights to Resume | సింగపూర్, భారత్ మధ్య ఈ నెల 29 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. చెన్నై, ఢిల్లీ, ముంబై మధ్య ప్రతిరోజూ ఆరు విమాన సర్వీసులను నడుపుతామని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ సింగపూర్ (సీఏఏఎస్) ఆదివారం ప్రకటించింది. ఈ విషయమై భారత పౌర విమానయాన శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.
రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్న భారతీయులకు సింగపూర్‌కు వచ్చేందుకు ఈ నెల 29 నుంచి వచ్చే ఏడాది జనవరి 21 వరకు వ్యాక్సినేటెడ్ ట్రావెల్ పాస్ (వీటీపీ) అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. సింగపూర్‌కు రావాలంటే షార్ట్‌టర్మ్, లాంగ్ టర్మ్ వీసాదారులు.. తప్పనిసరిగా ఈ.. వీటీపీ అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. సింగపూర్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు వీటీపీ అప్లికేషన్లు ఇండోనేషియా, మలేషియా ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
ఫిన్లాండ్, స్వీడన్లతోపాటు భారతీయులకు అదే రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అప్లికేషన్లు లభిస్తాయి. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి సింగపూర్‌కు రావాలంటే ఈ నెల 24న వీటీపీ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ట్రావెలర్లు ప్రత్యేకంగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే ముందుగా పర్యాటకులకు వీటీపీ అప్రూవల్ పొందాల్సి ఉంటుంది. అంతే కాదు.. కొవిడ్-19 అనుబంధ చికిత్స కోసం 30 వేల డాలర్ల కవరేజీ గల ప్రయాణ బీమా చేయించాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. గ్లోబల్ పేమెంట్ ట్రాన్స్ఫర్ కోసం డిజిటల్ వాలెట్
WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. మల్టీ డివైజ్ సపోర్ట్.. ఎనేబుల్ చేసుకోండిలా
WhatsApp : మీ నెంబర్ కే వాట్సప్ మెసేజ్ పంపించుకోవడం ఎలా? ముఖ్యమైన సమాచారం ఉంటే ఇలా షేర్ చేసుకోండి
లాస్ట్ సీన్.. ఎవరు చూడాలనేది ఇక మన ఇష్టం
WhatsApp : 2021 ముగిసేనాటికి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. ఇదిగో ఆ లిస్టు!