Gold Rates | మళ్లీ పుంజుకుంటున్న బంగారం, వెండి ధరలు
Gold Rates | దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.14,300 లేదా 5 శాతం ఎగబాకి రూ.2,98,300కి చేరుకున్నది. రికార్డు స్థాయిలో పతనమైన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి.
Gold Rates | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: రికార్డు స్థాయిలో పతనమైన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు బుధవారం కిలో వెండి ఏకంగా రూ.3 లక్షలకు చేరువకాగా, బంగారం రూ.1.65 లక్షలు అధిగమించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.14,300 లేదా 5 శాతం ఎగబాకి రూ.2,98,300కి చేరుకున్నది.
అంతకుముందు ఇది రూ.2.84 లక్షలుగా ఉన్నది. అలాగే 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పుత్తడి ధర రూ.7,400 లేదా 4.69 శాతం బలపడి రూ.1,65,100కి చేరుకున్నది. డాలర్ బలహీనంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దూసుకుపోవడం, పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ మెరుగుపడటం ధరలు పుంజుకోవడానికి కారణాలని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 100 డాలర్లు ఎగబాకి 5,047 డాలర్లకు చేరుకోగా, వెండి 4.28 డాలర్లు అందుకొని 89.35 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.
Read Also :
GHMC | జీహెచ్ఎంసీలో ప్రైవేట్ ఏజెన్సీల అక్రమాలు.. అడ్డదారిలో పనులు
2.5 కోట్లమంది ఆధార్ నంబర్లు డీయాక్టివేట్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

