e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News Home sales Hyderabad | హైద‌రాబాదీల్లో సొంతింటిపై మ‌క్కువ‌..!

Home sales Hyderabad | హైద‌రాబాదీల్లో సొంతింటిపై మ‌క్కువ‌..!

Home sales Hyderabad |సొంతింటి క‌ల నెర‌వేర్చుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రి ఆకాంక్ష‌.. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌ర్వాత అది మ‌రింత పెరిగింది. అదీ కూడా హైద‌రాబాదీల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. గ‌తేడాది (2020)తో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్ధ‌భాగం (జ‌న‌వ‌రి-జూన్‌)లో తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ ప‌రిధిలో రెసిడెన్షియ‌ల్ హౌసెస్ ఇండ్ల విక్ర‌యాలు పెరిగాయి. దేశంలోని టాప్‌-7 సిటీల‌తో పోలిస్తే భాగ్య న‌గ‌ర ప‌రిధిలో ఇండ్ల విక్ర‌యాలు 18 శాతం వృద్ధి చెందాయి.

ఇలా తెలంగాణ స‌ర్కార్‌.. టీఎస్ బీపాస్‌..

భూమి అభివృద్ధి, ఇండ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన ప‌లు అనుమ‌తుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చింది. తెలంగాణ స్టేట్ బిల్డింగ్ ప‌ర్మిష‌న్ అప్రూవ‌ల్ అండ్ సెల్ఫ్ స‌ర్టిఫికేష‌న్ సిస్ట‌మ్ (టీఎస్ బీ-పాస్‌) ద్వారా సెల్ఫ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించిన 21 రోజుల్లో అనుమ‌తులు మంజూరు చేస్తున్న‌ది. మ‌రోవైపు ఆస్తుల క్ర‌య విక్ర‌యాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం ఆస్తి ప‌న్నుపై 50 శాతం రాయితీ క‌ల్పించింది. దీంతో ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇండ్ల విక్ర‌యాలు పెరుగుతాయ‌ని సీబీఆర్ఈ సౌత్ ఆసియా అంచ‌నా వేసింది.

హైద‌రాబాద్‌తోపాటు బెంగ‌ళూరు, పుణె కూడా

- Advertisement -

హై ఎండ్ (విలాస‌వంత‌మైన) రెసిడెన్షియ‌ల్‌ సెగ్మెంట్‌లో ఆస్తుల ధ‌ర‌లు 1-6 శాతం పెరిగాయి. 2010 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మిడ్ సెగ్మెంట్‌లో 2.7 శాతం ధ‌ర‌లు పెరిగాయి. హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, పుణె న‌గ‌రాల్లో హై ఎండ్ రెసిడెన్షియ‌ల్ ఇండ్ల ధ‌ర‌ల్లో వృద్ధి న‌మోదైంది.

దేశ‌వ్యాప్తంగా ఈ ఏడాది ఇండ్ల విక్ర‌యాలు 75 శాతానికి పైగా పెరిగాయి. 2021 తొలి అర్ధ‌భాగంలో పుణెలో సుమారు 26 శాతం, ముంబైలో 19 శాతం సేల్స్ పెరిగాయి. త‌ర్వాతీ జాబితాలో హైద‌రాబాద్ పరిధిలో 18, ఢిల్లీ-దేశ రాజ‌ధాని ప్రాంతం (ఎన్సీఆర్‌) ప‌రిధిలో 17 శాతం సేల్స్ వృద్ధి చెందాయి.

ప్ర‌భుత్వాల ఇన్సెంటివ్‌లు.. త‌క్కువ వ‌డ్డీరేట్లు

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించిన విధానాలు, వ‌డ్డీరేట్లు త‌గ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణ‌యం, డెవ‌ల‌ప‌ర్లు ప్ర‌క‌టిస్తున్న ఇన్సెంటివ్‌ల‌తో దేశంలోని ఏడు ప్ర‌ధాన మెట్రో న‌గ‌రాల ప‌రిధిలో ఇండ్ల విక్ర‌యాలు పుంజుకున్నాయ‌ని సీబీఆర్ఈ సౌత్ ఆసియా నివేదిక వెల్ల‌డించింది.

దేశ‌వ్యాప్తంగా హై ఎండ్ (విలాస‌వంత‌మైన‌) సెగ్మెంట్‌లో ఆస్తుల ధ‌ర‌లు 1-6 శాతం పెరిగాయి. 2010 నుంచి మిడ్ సెగ్మెంట్ ప‌రిధిలో 2-7 శాతం వృద్ధి చెందాయి. ఇక 2010-20 మ‌ధ్య వ్య‌క్తిగ‌త జీడీపీ 4 శాతం పెరిగింది. దేశంలోని ఏడు మెట్రో న‌గ‌రాల ప‌రిధిలోని వ్య‌క్తిగ‌త జీడీపీ.. జాతీయ స‌గ‌టు కంటే ఎక్కువ‌.

ప్ర‌జ‌ల ఆదాయానిక‌నుగుణంగా ధ‌ర‌ల్లోనూ వృద్ధి

వివిధ రంగాల్లోని ప్ర‌జ‌ల ఆదాయం వృద్ధి చెంద‌డంతో స‌గ‌టున ఆస్తుల ధ‌ర‌లు కూడా పెరిగాయి. దీంతో చౌక‌గా ఇండ్ల కొనుగోలుకు అవ‌కాశాలు పెరిగాయి. 2019 ఫిబ్ర‌వ‌రి నుంచి 2020 మే వ‌ర‌కు రెపోరేట్‌ను ఆర్బీఐ 6.25 శాతం నుంచి 4 శాతానికి త‌గ్గించ‌డం కూడా దీనికి కార‌ణం. హోంలోన్ల‌పై వ‌డ్డీరేట్లు 6.7-6.9 శాతానికి దిగి వ‌చ్చాయి.

2014లో అంద‌రికి ఇండ్ల‌పై ఇదీ మోదీ స‌ర్కార్ పాల‌సీ

2014లో కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన న‌రేంద్ర‌మోదీ స‌ర్కార్‌.. 2022 నాటికి చౌక‌ధ‌ర‌లో ప్ర‌తి ఒక్క‌రికి సొంతిల్లు అందుబాటులోకి తేవాల‌ని విధాన నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఆ దిశ‌గా 2019లో నిర్మాణంలో ఉన్న ఇండ్ల‌పై జీఎస్టీని 2019లో 8 నుంచి ఒక‌శాతానికి త‌గ్గించింది కేంద్రం.

భార‌త్‌లో రియ‌ల్ ఎస్టేట్ సెక్టార్ గ్రోత్‌లో రెసిడెన్షియ‌ల్ సెగ్మెంట్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంద‌ని సీబీఆర్ఈ ఇండియా, సౌత్ ఆసియా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా చైర్మ‌న్ అన్షుమ‌న్ మ్యాగ‌జైన్ వ్యాఖ్యానించారు. ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్టాంప్ డ్యూటీ త‌గ్గించాయి. దీనికి తోడు బ్యాంకులు చ‌రిత్ర‌లో క‌నిష్ఠ స్థాయి వ‌డ్డీరేట్లు ఆఫ‌ర్ చేస్తున్నాయి. రుణాల‌పై మార‌టోరియం పొడిగింపు వంటి నిర్ణ‌యాలు రియాల్టీ రంగ వృద్ధికి దోహ‌ద ప‌డ్డాయ‌న్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

Covid Antibodies: వైర‌స్ సోకిన ఏడు నెల‌ల త‌ర్వాతా పుష్క‌లంగా యాంటీబాడీలు!

Kokari Robbery : చరిత్రలో ఈరోజు.. కాకోరి రైలు దోపిడీకి 96 ఏండ్లు

Italy Century Village : సెంచరీలు దాటించే ఊరు మాది..!

Vivo Y53s : వివో నుంచి స‌రికొత్త ఫోన్.. 20 వేల లోపు ధ‌ర‌లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో

pegasus row: ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో ఎలాంటి లావాదేవీలు జరుపలేదు: రక్షణ శాఖ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement