Covid Antibodies: వైరస్ సోకిన ఏడు నెలల తర్వాతా పుష్కలంగా యాంటీబాడీలు!
కరోనా వైరస్ ఓసారి సోకి తగ్గిన తర్వాత శరీరంలో IgG యాంటీబాడీలు ( Covid Antibodies ) ఎన్ని రోజులు ఉంటాయి? దీనికి ఇప్పటి వరకూ స్పష్టమైన సమాధానం లేకపోయినా.. తాజా అధ్యయనంలో మాత్రం ఏడు నెలల వరకూ ఇవి స్థిరంగా లేదంటే మరింత పెరిగినట్లు తేలింది.

బార్సిలోనా: కరోనా వైరస్ ఓసారి సోకి తగ్గిన తర్వాత శరీరంలో IgG యాంటీబాడీలు ( Covid Antibodies ) ఎన్ని రోజులు ఉంటాయి? దీనికి ఇప్పటి వరకూ స్పష్టమైన సమాధానం లేకపోయినా.. తాజా అధ్యయనంలో మాత్రం ఏడు నెలల వరకూ ఇవి స్థిరంగా లేదంటే మరింత పెరిగినట్లు తేలింది. ఈ అధ్యయనం తాలూకు ఫలితాలను నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించారు. అంతేకాదు సాధారణంగా వచ్చే జలుబు కోసం శరీరంలో ఉండే యాంటీబాడీలు కూడా కొవిడ్-19పై సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరిగింది.
కరోనా వైరస్ పరిణామ క్రమం తెలుసుకోవడంతోపాటు దానిని అడ్డుకోవడంలో ఈ విషయాలు కీలకంగా మారనున్నాయి. ఐఎస్ గ్లోబల్ రీసెర్చర్ కార్లోటా డొబానో నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో భాగంగా హాస్పిటల్ క్లినిక్‌లోని ఆరోగ్య కార్యకర్తలను పరిశీలించారు. మొత్తం 578 మంది పార్టిసిపెంట్ల నుంచి రక్త నమూనాలను సేకరించారు. గతేడాది మార్చి నుంచి అక్టోబర్ మధ్య నాలుగుసార్లు ఈ నమూనాలను తీసుకున్నారు. లుమినెక్స్ టెక్నాలజీని ఉపయోగించి ఈ నమూనాల్లోని IgA, IgM లేదా IgG యాంటీబాడీల సంఖ్యను లెక్కించారు.
ఈ ఆరోగ్య కార్యకర్తల్లో చాలా వరకూ కరోనా తొలి వేవ్‌లోనే ఆ వైరస్ బారిన పడ్డారు. వీళ్లలోని IgG యాంటీబాడీలు చాలా కాలం పాటు స్థిరంగా ఉన్నట్లు ఇందులో గుర్తించారు. అంతేకాకుండా వీళ్లలో 75 శాతం మందిలో IgG యాంటీబాడీల సంఖ్య ఐదు నెలల తర్వాత పెరగడం ప్రారంభించినట్లు ఈ అధ్యయనంలో పాల్గొన్న సీనియర్ ఆథర్ గెమ్మా మాంకునిల్ వెల్లడించారు. ఇక మనుషుల్లో హ్యూమన్ కోల్డ్ కరోనా వైరస్ల(HCoV)కు సంబంధించిన యాంటీబాడీలు కూడా కొవిడ్-19 వైరస్‌పై పని చేస్తున్నట్లు కూడా ఇందులో గుర్తించారు. కొవిడ్ బారిన పడిన వాళ్లలో ఈ HCoV యాంటీబాడీలు తక్కువగా ఉన్నట్లు తేలింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

