సోమవారం 08 మార్చి 2021
Business - Jan 13, 2021 , 02:30:00

గ్రాన్‌ కౌప్‌లో పెట్రోల్‌ వెర్షన్‌

గ్రాన్‌ కౌప్‌లో పెట్రోల్‌ వెర్షన్‌

  • ధర రూ.40.90 లక్షలు

న్యూఢిల్లీ, జనవరి 12: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. 2 సీరిస్‌ గ్రాన్‌ కౌప్‌ పెట్రోల్‌ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ధరను రూ.40.90 లక్షలుగా నిర్ణయించింది. ఎం స్పోర్ట్‌ ప్యాకేజి కలిగిన ఈ కారు చెన్నైలో ఉన్న ప్లాంట్లోనే తయారు అయింది. ఇప్పటికే సంస్థ రెండు డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన కార్లను దేశీయంగా విక్రయిస్తున్నది. లగ్జరీ కార్ల సెగ్మెంట్‌ పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ నూతన వెర్షన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. రెండు లీటర్ల నాలుగు సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ కారు కేవలం 7.1 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. 


VIDEOS

logo