మంగళవారం 27 అక్టోబర్ 2020
Business - Jun 07, 2020 , 22:23:29

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తితో అల్లాడిపోతున్న సామాన్యుడికి చమురు సంస్థలు మరోసారి ధరలు పెంచి వాత పెట్టాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్ ‌/ డీజిల్‌పై 60 పైసల మేర ధరలను పెంచాయి. దీనికి అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో విక్రయ పన్ను/ వ్యాట్‌, ఇతర స్థానిక పన్నులు కూడా పెరుగడంతో ధరలు భారీగా పెరుగనున్నాయి. 

పెట్రోలియం ఉత్పత్తుల ప్రాథమిక ధరలు పెంచుతూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకోవడం 83 రోజుల తర్వాత ఇదే తొలిసారి. కరోనా మహమ్మారిని కట్టడి చేసే చర్యలు చేపట్టేందుకు కేంద్రం లీటర్‌ పెట్రోల్‌/ డీజిల్‌పై రూ.3 అదనంగా ఎక్సైజ్‌ సుంకం పెంచింది. దీనివల్ల లీటర్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.22.98, లీటర్‌ డీజిల్‌పై 18.83లకు పెరిగింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పతనం కావడంతో కేంద్రం పెంచిన ఎక్సైజ్‌ సుంకానికి అనుగుణంగా ముడి చమురు ధరలను పెంచలేదు. మార్చి 16న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌, సెస్‌ రూపంలో పన్నులు పెంచడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచలేదు. తమ నష్టాలను తగ్గించుకునేందుకు రోజువారీగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సవరిస్తూ వచ్చిన కేంద్ర చమురు సంస్థలు మార్చి 16 నుంచి ధరల సవరణను నిలిపివేశాయి.  


logo