ఇక మైక్రో కంటైన్మెంట్జోన్లు

- వైరస్ విస్తరించిన ప్రాంతాలపై పటిష్ఠ నిఘా
- సెలవు రోజుల్లోనూ భారీగా కొవిడ్ పరీక్షలు
- కరోనా కట్టడికి యాక్షన్‌ప్లాన్ అమలుచేయాలి
- డీఎంహెచ్‌వోలకు డీహెచ్ శ్రీనివాసరావు ఆదేశాలు
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాప్తిని నిరోధించేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలకు ఉపక్రమించింది. గతంలోలాగానే మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, పోలీస్, పారిశుద్ధ్యం తదితరశాఖలతో సమన్వయం చేసుకొంటూ ముందుకుసాగాలని నిర్ణయించింది. సరిహద్దు జిల్లాల్లో నియంత్రణ చర్యలు కట్టుదిట్టం చేయడంతోపాటు, వైరస్ ఎక్కువగా విస్తరిస్తున్న ప్రాంతాలను గుర్తించి మైక్రో కంటైన్మెంట్జోన్లు ఏర్పాటుచేనున్నది. ఈ మేరకు 7 కీలక అంశాలతో నూతన యాక్షన్‌ప్లాన్‌ను సిద్ధంచేసింది. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచడం, పాజిటివ్ కేసులను వేగంగా గుర్తించి చికిత్స అందించడం, వ్యాక్సినేషన్‌ను వేగవంతంపై దృష్టి సారించింది. మంగళవారం అన్నిజిల్లాల డీఎంహెచ్వోలతో వీడియోకాన్ఫరెన్స్‌లో కొవిడ్ నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని డీహెచ్ శ్రీనివాసరావు వివరించారు.
పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్
కరోనా కేసులు పెరుగుతుండటంతో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామం, ఇబ్రహీంపట్నం మండలకేంద్రంలో మంగళవారం నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించుకున్నారు. కొందరు వారం, మరికొందరు 15 రోజులు లాక్డౌన్ ప్రకటించుకుని వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని నిర్ణయించారు.
ఇదీ యాక్షన్ ప్లాన్..
- 45 ఏండ్లు దాటినవారిని గుర్తించి వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచాలి. రోజూ ప్రతి పీహెచ్సీలో వంద డోసులు, సీహెచ్‌సీలో 200 డోసులు, టీచింగ్ దవాఖానల్లో 300 డోసులకు తగ్గకుండా వ్యాక్సిన్ ఇవ్వాలి.
- కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచి సెలవు రోజుల్లోనూ భారీగా నిర్వహించాలి. యాప్ ద్వారా ట్రేసింగ్ను పకడ్బందీగా నిర్వహించాలి. పాజిటివ్ వచ్చినవారి వివరాలు, వారితో కాంటాక్టులో ఉన్నవారి వివరాలను యాప్‌లో పొందుపర్చాలి.
- పాజిటివ్ వచ్చినవారికి తప్పనిసరిగా హోం ఐసొలేషన్ కిట్లు అందించాలి. ప్రతీ పీహెచ్సీలో కిట్లు అందుబాటులో ఉంచాలి.
- జిల్లాల్లో ఎక్కువగా వైరస్ విస్తరిస్తున్న ప్రాంతాలను గుర్తించి నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేయాలి.
- ప్రతి జిల్లాలో కనీసం వంద పడకలతో కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలి. అక్కడ 24 గంటలపాటు నర్సులు అందుబాటులో ఉండటంతోపాటు వైద్యులు రోజుకు మూడుసార్లు పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలి.
- సదుపాయాలు కలిగిన ప్రైవేటు దవాఖానలను కొవిడ్ చికిత్స, వ్యాక్సినేషన్ కోసం గుర్తించాలి. ఐసీయూ, ఆక్సిజన్ బెడ్స్ పెరిగాయా గుర్తించాలి.
- ప్రజలంతా మాస్కులు ధరించడం, గుమిగూడకుండా.. ప్రభుత్వ ఆదేశాలు అమలయ్యేలా పోలీసులు, స్థానికసంస్థలతో కలిసి పనిచేయాలి.
‘ప్రైవేటు’లో సగం బెడ్లు
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేటు దవాఖానల్లో సగం పడకలు కరోనా చికిత్సకోసం అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దవాఖానల్లో సగం పడకలను కరోనా చికిత్సకు కేటాయించేందుకు సిద్ధమని దవాఖాన యాజమాన్యాలు తెలిపాయి. మానవతా దృక్పథంతో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకే చికిత్స అందిస్తామని పేర్కొన్నాయి. ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలతో మంగళవారం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు ఫలప్రదమయ్యాయి. కరోనా సాధారణ లక్షణాలు ఉండి చికిత్స పొందాలనుకునేవారి కోసం హోటళ్లలో కార్పొరేట్ దవాఖానలు కొవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించనున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఆరోగ్యకర సమాజంతోనే అభివృద్ధి సాధ్యం
పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్
నేటినుంచి టీచర్లకు ఒంటిపూట బడులు
జానారెడ్డి గెలిచి ఏం చేస్తారు?
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

