AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
AP News | ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. విజయవాడ శివారులో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా దొరికింది. వాళ్ల నుంచి ఓ వాహనంతోపాటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీ, బంగారం పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ.5.84 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
AP News : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. విజయవాడ శివారులో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా దొరికింది. వాళ్ల నుంచి ఓ వాహనంతోపాటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీ, బంగారం పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ.5.84 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు బంగారం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
స్కార్పియో వాహనంలోని సీక్రెట్ డ్రాలో ఉన్న 60 వేల అమెరికన్ డాలర్లు, 21,500 యూరోల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ వైపు బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు బంగారం క్యారియర్లను అరెస్ట్‌చేశారు. వారు నడుముకు కట్టుకున్న పౌచ్‌లో 3.147 కిలోల బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. హైదరాబాద్ యూనిట్, విజయవాడ రీజినల్ యూనిట్ డీఆర్ఐ అధికారులు సమన్వయంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. బంగారం స్మగ్లింగ్ ముఠాపై దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

