Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Elon Musk | మన దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు (Internet Services) అందించాలని తహతహలాడుతున్న స్పేస్ ఎక్స్ సీఈవో (SpaceX CEO) ఎలాన్ మస్క్ (Elan Musk) కు సంబంధించి సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్ (Ukraine) లో స్టార్‌లింక్ శాటిలైట్ నెట్వర్క్ (Starlink Sattellite Network) నెమ్మదించిందని ఓ మీడియా రిపోర్టు స్పష్టంచేసింది.
Elon Musk : మన దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు (Internet Services) అందించాలని తహతహలాడుతున్న స్పేస్ ఎక్స్ సీఈవో (SpaceX CEO) ఎలాన్ మస్క్ (Elan Musk) కు సంబంధించి సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్ (Ukraine) లో స్టార్‌లింక్ శాటిలైట్ నెట్వర్క్ (Starlink Sattellite Network) నెమ్మదించిందని ఓ మీడియా రిపోర్టు స్పష్టంచేసింది. కాగా స్టార్‌లింక్ ఉపగ్రహ నెట్వర్క్ నెమ్మదించడంవల్లే ఇటీవల ఉక్రెయిన్‌లో డ్రోన్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఆ సందర్భంలో నెట్వర్క్ వేగాన్ని తగ్గించాల్సిందిగా ఎలాన్ మస్కే స్వయంగా ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం పేర్కొన్నది.
ఇద్దరు అమెరికా అధికారులు, సంబంధిత వర్గాలు విషయం చెప్పినట్లు ఆ మీడియా రిపోర్టు ఉటంకించింది. ఉద్దేశపూర్వకంగా నెట్వర్క్ వేగాన్ని తగ్గించాలని మస్క్ ఆదేశించారని, ఆ నిర్ణయం ఉక్రెయిన్‌లో ఆందోళన రేకెత్తించిందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇదంతా అమెరికా యంత్రాంగాన్ని అయోమయానికి గురిచేసిందని పేర్కొన్నాయి. ఇటీవల రష్యాతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీజిల్ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలోనే యుద్ధరంగంలో ఉక్రెయిన్ డ్రోన్లు వేగాన్ని కోల్పోయాయి. అమెరికా మద్దతు సన్నగిల్లడంతో రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ వాడుతున్న స్టార్‌లింక్ కమ్యూనికేషన్ పరికరాలపై మస్క్ నియంత్రణలు విధించినట్లు వార్తలు రాగా వాటిని ఆయన అప్పుడు తోసిపుచ్చారు.
స్టార్‌షీల్డ్ (సైనిక అవసరాల కోసం ఉపయోగించే స్టార్‌లింక్) అమెరికా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుందని నాడు మస్క్ వివరణ ఇచ్చారు. స్టార్‌లింక్ సేవల కోతతో తమకు ఎలాంటి సంబంధం లేదని యూఎస్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే స్పష్టంచేశారు. సేవల వేగం విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఉక్రెయిన్ విజయం సాధించాలని తాము కోరుకుంటున్నామని వివరణ ఇచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

