న్యూఢిల్లీ : త్వరలో లాంఛ్ కానున్న ఒప్పో రెనో 7, రెనో 7 ప్రొతో కూడిన రెనో సిరీస్ ఫోన్ల స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. గతంలో రెనో 7 సిరీస్ 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్‌తో కస్టమర్ల ముందుకువస్తుందని వార్తలు రాగా, తాజాగా ఒప్పో రెనో 7 పూర్తి స్పెసిఫికేషన్స్ ఇవేనంటూ లీకులొచ్చాయి. చైనా సోషల్ మీడియా దిగ్గజం వీబోలో ఈ సమాచారం పోస్ట్ అయింది. తాజా లీకుల ప్రకారం రెనో 7 సిరీస్ డిజైన్ ఇటీవల లాంఛ్ అయిన రియల్‌మి జీటీ నియో 2ను పోలి ఉంది.
ఒప్పో రెనో 7..50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్‌కు తోడు 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ముందు భాగంలో ఒప్పో రెనో 7 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 కెమెరా కస్టమర్లను అలరించనుందని లీకుల్లో వెల్లడైంది. ఒప్పో రెనో 7 8జీబీ ర్యామ్ వెర్షన్ రూ 35,140, 12 జీబీ ర్యామ్ పోన్ రూ 38,700కు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఒప్పో రెనో 7 సిరీస్ గురించి కంపెనీ అధికారికంగా ఇంతవరకూ ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు.