Supreme Court | షరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు మెయిల్‌కే.. సుప్రీం కోర్టులో ఎల్అండ్టీకి ఎదురుదెబ్బ
ఎల్అండ్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ చేపట్టిన కేపీసీఎల్ షరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎల్అండ్టీకి నిరాశే ఎదురైంది.
Supreme Court | న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఎల్అండ్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ చేపట్టిన కేపీసీఎల్ షరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎల్అండ్టీకి నిరాశే ఎదురైంది. చివరకు ఈ ప్రాజెక్టు మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దక్కించుకున్నది. ఈ టెండర్ ప్రక్రియకు వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి భంగపడ్డ ఎల్అండ్టీ.. ఆ తర్వాత సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
మెయిల్, కేపీసీలను ప్రతివాదులుగా చేర్చింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఎల్అండ్టీ పిటిషన్‌ను సోమవారం కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై వాదనలు సుదీర్ఘంగా విన్న తర్వాత పిటిషన్‌ను కొట్టివేసింది. టెండర్ దాఖలుకు రాష్ట్రం తగినంత సమయం మంజూరు చేసిందని, ఆ సంస్థ బిడ్‌ను సమర్పించలేకపోయిందని పేర్కొంది. ఎలక్ట్రో-మెకానికల్, హైడ్రో-మెకానికల్ పనులలో అనుభవం లేని ఎల్అండ్టీ ఈ టెండర్లలో పాల్గొనడానికి అర్హత లేదని తెలిపింది. దీంతో రూ.8 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న 2000 మెగావాట్ల షరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు మెఘా వశమైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

