Microsoft | ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. దాదాపు 300 మందికిపైగా ఉద్యోగులకు (employees) లేఆఫ్స్ (layoffs) ప్రకటించింది. తాజా తొలగింపులు వాషింగ్టన్ కార్యాలయం నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. తాజా కోతలు సంస్థలోని మొత్తం సిబ్బందిలో 1 శాతం కంటే తక్కువ అని ది సియాటిల్ టైమ్స్ నివేదిక తెలిపింది. ‘మార్కెట్లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూన్నాం’ అని మైక్రోసాఫ్ట్ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. తాజా రౌండ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రాడక్ట్ మేనేజర్లు ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్లు సమాచారం.
కాగా, మైక్రోసాప్ట్ గత నెల మధ్యలో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తమ సిబ్బందిలో మూడు శాతం మందికి లేఆఫ్‌లు ఇచ్చింది. అంటే దాదాపు 6వేల మందిని తొలగించింది. 2023లో 10 వేలమందికి ఉద్వాసన పలికిన అనంతరం ఇదే రెండో అతిపెద్ద తొలగింపు. మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యమని సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక ఈ ఏడాది జనవరిలో కూడా పనితీరు ఆధారంగా కొంతమందిని సంస్థ తొలగించిన విషయం తెలిసిందే.
Also Read..
Disney: వాల్ట్ డిస్నీలో ఉద్యోగుల తొలగింపు .. ఫిల్మ్, టీవీ, ఫైనాన్స్ రంగాల్లో వేటు
corona virus | దేశంలో 4 వేలు దాటిన కరోనా కేసులు.. 37 మంది మృతి
Spying | పాక్ కోసం గూఢచర్యం.. పంజాబ్ వ్యక్తి అరెస్ట్