Maruti No More Diesel | దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక ముందు డీజిల్ సెగ్మెంట్ కార్ల తయారీ వైపు వెళ్లరాదని నిర్ణయించుకున్నది. ఇప్పటికే డీజిల్ కార్ల సేల్స్ తగ్గుముఖం పట్టడంతోపాటు 2023 నుంచి తదుపరి దశ కర్బన ఉద్గారాల నియంత్రణ నిబంధనలు అమలులోకి రావడం దీనికి కారణం అని మారుతి సుజుకి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సీవీ రామన్ చెప్పారు. కర్బన ఉద్గారాల నియంత్రణ నిబంధనలు పాటిస్తూ డీజిల్ కార్లు తయారు చేయాలంటే ఖర్చు పెరుగుతుందన్నారు. డీజిల్ కార్ల తయారీ ఖర్చు వాటి ధరల పెరుగుదలకు దారి తీస్తుందని, తద్వారా విక్రయాలు పడిపోతాయని సీవీ రామన్ తెలిపారు.
కొన్నేండ్లుగా కార్ల మార్కెట్ క్రమంగా పెట్రోల్ కార్ల వైపు మళ్లుతున్నదని చెప్పారు. ఇంతకుముందు కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంటే డీజిల్ కార్లను తయారు చేసే అంశాన్ని అధ్యయనం చేసి నిర్ణయం తీసుకునే వారం అని, కానీ ఇక ముందు డీజిల్ కార్ల తయారీ నుంచి పూర్తిగా వైదొలిగినట్లేనన్నారు. ప్రస్తుతం దేశీయంగా ప్యాసింజర్ వెహికల్స్‌లో డీజిల్ కార్లు 17 శాతం లోపే. 2013-14 నుంచి భారీగా డీజిల్ కార్ల వాడకం తగ్గుముఖం పట్టింది. అంతకుముందు వరకు మొత్తం కార్ల సేల్స్‌లో 60 శాతం డీజిల్ కార్లే ఉండేవి.
కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశంలో బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్లు, వాహనాల తయారీలో డీజిల్ వినియోగ వెహికల్స్ వాహనాల తయారీ తగ్గింది. ప్రస్తుతం బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఒక లీటర్, 1.2 లీటర్లు, 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్లతో కూడిన కార్లను మారుతి సుజుకి అందిస్తున్నది. మొత్తం 15 మోడల్ కార్లలో ఏడు మోడల్స్ సీఎన్జీ వేరియంట్లు ఉన్నాయి.
ప్రస్తుతం తయారు చేస్తున్న పెట్రోల్ వినియోగ కార్లలో ఇంధన మైలేజీ సామర్థ్యం పెంపునకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు రామన్ చెప్పారు. న్యూవర్షన్ సెలెరియో కారు అత్యధికంగా లీటర్‌కు 26.68 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందన్నారు. తక్కువ వ్యయంతో తయారయ్యే సీఎన్జీ కార్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మున్ముందు మారుతి సుజుకి బ్రాండ్ కార్లు పూర్తి టెక్నాలజీతో అందుబాటులోకి వస్తాయన్నారు.
విద్యుత్, హైబ్రీడ్ టెక్నాలజీ కార్ల తయారీలో పవర్ట్రైన్లో చాలా మార్పులు తేవాల్సి ఉందని సీవీ రామన్ వివరించారు. తమ సంస్థ ఇప్పటికే 10 శాతం ఇథనాల్ మిక్సింగ్ పెట్రోల్ వినియోగ సామర్థ్యం గల కార్లను తీసుకొచ్చామని, 2023 నాటికి 20 శాతం బ్లెండింగ్ ఇథనాల్ ఇంధన కెపాసిటీ గల కార్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ అంశాల్లో ఇంధన లభ్యత వంటి అంశాలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Shortcuts : వాట్సాప్ వెబ్ లో షార్ట్‌కట్స్ గురించి తెలుసా..? అవేంటంటే..?
WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. గ్లోబల్ పేమెంట్ ట్రాన్స్ఫర్ కోసం డిజిటల్ వాలెట్
WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. మల్టీ డివైజ్ సపోర్ట్.. ఎనేబుల్ చేసుకోండిలా
WhatsApp : మీ నెంబర్ కే వాట్సప్ మెసేజ్ పంపించుకోవడం ఎలా? ముఖ్యమైన సమాచారం ఉంటే ఇలా షేర్ చేసుకోండి
లాస్ట్ సీన్.. ఎవరు చూడాలనేది ఇక మన ఇష్టం
WhatsApp : 2021 ముగిసేనాటికి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. ఇదిగో ఆ లిస్టు!