Intel | ప్రపంచవ్యాప్తంగా టెక్ (Tech industry) ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను (Employees) తొలగిస్తున్నాయి. తాజాగా చిప్ తయారీ సంస్థ ఇంటెల్ (Intel) తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఈ వారంలో 5 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
కాగా, ఇంటెల్ 4 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించనున్నట్లు ఇటీవలే అంచనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే, 4 వేల మంది కాదని, 5 వేల మందిని తొలగిస్తున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ వారంలోనే అమెరికా వ్యాప్తంగా తొలగింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా లే ఆఫ్‌లు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఒరెగాన్, కాలిఫోర్నియాలో ఎక్కువగా తొలగింపులు ఉంటాయని పేర్కొంది.
ఇందులో కాలిఫోర్నియా ఆఫీస్ నుంచి 1,935 మంది, ఒరెగాన్ యూనిట్ నుంచి 2,392 మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నట్లు తెలిసింది. అరిజోనా కార్యాలయం నుంచి 696 మందిపై వేటు పడనున్నట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో ఇంటెల్ కొత్త సీఈఓగా లిప్-బు టాన్ (Lip-Bu Tan) బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్న ఇంటెల్, తన ఉద్యోగుల్లో 20 శాతానికి పైగా తొలగించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే లేఆఫ్స్‌ను ప్రకటించింది.
Also Read..
Ranya Rao | గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. రన్యారావుకు ఏడాది జైలు శిక్ష
IndiGo | ‘ప్యాన్.. ప్యాన్.. ప్యాన్’ కాల్ ఇచ్చిన ఇండిగో పైలట్.. ఇంతకీ ఏంటి దీని అర్థం..?