Indore | దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా (Indias cleanest city) మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ (Indore) నగరం మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. స్వచ్ఛ నగరాల జాబితాలో ఇండోర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇలా ఈ నగరం మొదటి స్థానంలో నిలవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ఇవాళ ఆ నగరానికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డును అందజేశారు. ఇక రెండో స్వచ్ఛమైన నగరంగా సూరత్, మూడో స్థానంలో ముంబై మహా నగరం నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 అవార్డులను (Swachh Survekshan 2024-25 awards) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ ప్రదానం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన వేడుకల్లో ‘స్వచ్ఛ’ జాబితాలో నిలిచిన నగరాలకు అవార్డులను ప్రదానం చేశారు. కేంద్రం ప్రకటించిన ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపీలోని ఐదు నగరాలకు చోటు దక్కింది. విశాఖపట్నం జాతీయస్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు దక్కించుకుంది. రాజమహేంద్రవరానికి రాష్ట్రస్థాయిలో మినిస్టీరియల్ అవార్డు లభించింది. స్వచ్ఛ సూపర్‌లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, తిరుపతి, గుంటూరు ఎంపికయ్యాయి.
#WATCH | Delhi: Indore won the title of India’s cleanest city for the eighth time in a row. Surat stood second and Navi Mumbai third in the central government’s annual cleanliness survey.
President Droupadi Murmu presented the Swachh Survekshan 2024-25 awards today. pic.twitter.com/FlnDPiS5Dq
— ANI (@ANI) July 17, 2025
Also Read..
IndiGo | ‘ప్యాన్.. ప్యాన్.. ప్యాన్’ కాల్ ఇచ్చిన ఇండిగో పైలట్.. ఇంతకీ ఏంటి దీని అర్థం..?
Nitish Kumar | 125 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్.. ఎన్నికల వేళ బీహార్ సీఎం కీలక ప్రకటన
Bengaluru Stampede | తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణం.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నివేదిక