Nitish Kumar | బీహార్ (Bihar)లో ఎన్నికల వేడి మొదలైంది. ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు (Bihar assembly poll). దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు, పింఛన్లు వంటి కీలక హామీలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం నితీశ్ కుమార్ మరో కీలక పథకాన్ని ప్రకటించారు.
125 యూనిట్ల లోపు కరెంటు (free electricity) బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందుబాటు ధరల్లోనే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకూ ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ లెక్కన జులై నెల కరెంటు బిల్లు సైతం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని సీఎం వెల్లడించారు.
Also Read..
Bengaluru Stampede | తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణం.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నివేదిక
Heart Attack | షాకింగ్ ఘటన.. గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి
Homebound Movie | టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన జాన్వీకపూర్ చిత్రం