Heart Attack | రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక (9 Year Old Girl) ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి గుండెపోటు (Heart Attack) లక్షణాలతో మరణించినట్లు వైద్యులు గుర్తించారు.
ప్రాచి కుమావత్ (9) సికార్‌లోని దంతా పట్టణం (Danta town)లో గల ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. జలుబు ఉండటంతో గత రెండు, మూడు రోజులుగా చిన్నారి స్కూల్‌కు వెళ్లలేదు. సోమవారం పాఠశాలకు వెళ్లింది. చాలా యాక్టివ్‌గా మార్నింగ్ ప్రేయర్లో కూడా పాల్గొంది. అప్పటి వరకూ చాలా ఉత్సాహంగా, ఆరోగ్యంగా కనిపించిన చిన్నారి మధ్యాహ్నం లంచ్‌కు కూర్చున్న తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం చిన్నారిని హుటాహుటిన సమీపంలోని కమ్మూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అయితే, చిన్నారికి పల్స్ లేదని, బ్లడ్ ప్రెషర్ పడిపోయిందని, ఊపిరి ఆడటం లేదని అక్కడి వైద్యులు తెలిపారు. బాలికకు గుండెపోటు లక్షణాలు కనిపిస్తున్నట్లు చెప్పారు. అనంతరం బాలికను వేరే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. బాలిక ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read..
US Visa | అమెరికాలో అలా చేస్తామంటే కుదరదు..! యూఎస్ ఎంబసీ వార్నింగ్..!
Amarnath Yatra | జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు.. అమర్నాథ్ యాత్రకు బ్రేక్