US Visa | ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ ప్రభుత్వం అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఆ దేశానికి వెళ్లాలనుకునే వారికి హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో ఎవరిపైనా దాడి చేసినా దొంగతనాలు, దోపిడీకి పాల్పడితే సదరు వ్యక్తుల వీసా రద్దవుతుందని స్పష్టం చేసింది. నిందితులు మళ్లీ అమెరికాలో కాలు మోపేందుకు అనుమతి ఉండదని పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో రాయబార కార్యాలయంలో ఈ హెచ్చరికలు జారీ చేసింది. దాడులు, దొంగతనాలు, దోపిడీతో చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవడంతో వీసా రద్దవుతుందని స్పష్టం చేసింది.
మళ్లీ భవిష్యత్లో యూఎస్ వీసా పొందేందుకు అనర్హలవుతాని ఎతలిపింది. యునైటెడ్ స్టేట్స్ శాంతిభద్రతలకు విలువ ఇస్తుందని, విదేశీ సందర్శకులు అన్ని యూఎస్ చట్టాలను పాటించాలని ఆశిస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. అమెరికా నుంచి అక్రమ వలసదారులను బయటకు పంపే కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ క్రమంలో యూఎస్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదిక హెచ్చరికలు చేసినట్లుగా భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ప్రకారం.. జనవరి 20 నుంచి ఏప్రిల్ 29 వరకు 1.42లక్షల మందిని అమెరికా నుంచి బహిష్కరించారు.
అమెరికాలో దొంగతనానికి జరిమానా, జైలు శిక్ష నిబంధనలు ఉన్నాయి. యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రకారం.. దొంగిలించబడిన వస్తువుల విలువ 300 డాలర్ల కంటే తక్కువగా ఉంటే నిందితుడిపై కేటగిరీ ‘ఎ’ నేరం కింద అభియోగాలు మోపుతారు. ఈ కేసులో 2,500 డాలర్ల వరకు జరిమానా, జైలు శిక్ష (సంవత్సరం) వరకు విధించే అవకాశం ఉంటుంది. వస్తువు విలువ 300 డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే సదరు వ్యక్తిపై కేటగిరి ‘4) కింద అభియోగాలు మోపుతారు. 25వేల డాలర్ల జరిమానాతో పాటు ఏడాది నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.