న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఉధ్రుతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ మూడు రోజుల పాటు తమిళనాడులోని మూడు ప్రొడక్షన్ యూనిట్లను మూసేయాలని నిర్ణయించింది.
ఈ నెల 27, 28, 29 తేదీల్లో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రొడక్షన్ యూనిట్లు మూసివేస్తారు. ఈ నెల 31వ తేదీన తిరిగి ఎన్ఫీల్డ్ తన కార్యకలాపాలను ప్రారంభించనుందని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బి.గోవింద రాజన్ కార్మికులకు పంపిన నోట్లో పేర్కొన్నారు.
ఆ మూడు రోజుల పాటు నిలిచిపోయిన ఉత్పత్తి ఆ తర్వాత రోజుల్లో అవసరాన్ని బట్టి భర్తీ చేసుకుంటామని పేర్కొంది. అయితే, దీనిపై రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అధికారిక ప్రకటనేది రాలేదు.
ఈ మూడు ప్లాంట్లు తమిళనాడులోని చెన్నై చుట్టుపక్కల ఉన్నాయి. ఈ నెల 13, 14, 15 తేదీల్లో కూడా ఈ ప్లాంట్లను మూసివేశారు. ఆటోహబ్గా పేరున్న తమిళనాడులో గత వారం కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి.
దీంతో పలు పరిశ్రమలను వాటి యాజమాన్యాలు తాత్కాలికంగా మూసివేశాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్డౌన్ విధించిన తర్వాత కొన్ని కంపెనీలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది. అలా అనుమతులు ఇచ్చిన వాటిలో ఆటోమొబైల్ పరిశ్రమలు కూడా ఉన్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇటీవలే వివిధ మోడళ్లకు చెందిన 2,36,966 బైక్‌లను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో మెటియర్ 350, క్లాసిక్ 350, బుల్లెట్ 350 మోడల్స్ బైక్‌లు ఉన్నాయి.
భారత్, థాయ్‌లాండ్, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తోపాటు ఏడు దేశాల నుంచి బైక్‌లను రీకాల్ చేస్తున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ వెల్లడించింది.
ఇంజిన్‌లోని ఇగ్నిషన్ కాయిల్లో లోపాన్ని గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ లోపాలున్న కాయిల్ తయారీలో ఉపయోగించిన వస్తువులను ఓ సప్లయర్ దగ్గరి నుంచి తీసుకున్నామని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే ఆయా బైక్‌లను రీకాల్ చేసి లోపాల్ని సరి చేస్తున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ వివరించింది. భారత్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లను ఐషర్ కంపెనీ తయారు చేస్తున్నది.
కొత్త ఐటీ నిబంధనలతో పౌరుల ప్రైవసీ ఉల్లంఘనే: వాట్సాప్
జగన్ బెయిల్ విచారణ జూన్ 1కి వాయిదా
Flipkart Shop From Home Days sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్
మొదటి డోసు కోవిషీల్డ్.. రెండోసారి కోవాగ్జిన్
జూన్ 1 నుంచి అలిపిరి నడక మార్గం మూసివేత
యాస్‌తో 3 లక్షల ఇండ్లకు నష్టం : మమతా బెనర్జీ
ఉత్తరాది ఓటర్లపై డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
చిన్న పరిశ్రమలకు త్వరలో ఉద్దీపన ప్యాకేజీ
బంగారం కొనుగోలుదారులకు ఊరట.. ఎందుకంటే?!
బంగారం బుల్ రంకె.. నెలలోనే 7% పైపైకి?!
ఆటో కంపెనీల వారంటీ, ఫ్రీ సర్వీస్ పీరియడ్ పొడిగింపు!
గల్వాన్ సరిహద్దు ఘర్షణ వేళ.. డ్రాగన్‌కు ఆ ఎగుమతులు రెట్టింపు!!
డైమండ్ ట్రేడర్ నుంచి.. ఆసియా బిలియనీర్ వరకూ..!!
200 కోట్ల డోస్‌ల ఉత్పత్తికి వాక్‌హార్డ్ రెడీ.. కానీ?!