Demand For Home Loans | తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తోపాటు పుణె, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో 2020 ద్వితీయార్థంతో పోలిస్తే 2021 జనవరి- జూన్ మధ్య ఇండ్ల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. లక్నో, పాట్నా, ఇండోర్, జైపూర్, ఆగ్రా వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఇండ్ల రుణాలకు డిమాండ్ ఎక్కువైంది. ఇంటి రుణాల కోసం కస్టమర్లు ఎక్కువగా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంకుల వెబ్సైట్లను సందర్శించారు.
మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల వారి నుంచి సొంతిండ్ల కోసం డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ప్రథమ శ్రేణి నగరాల్లో రూ.36 లక్షల్లోపు, ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో రూ.26 లక్షల్లోపు విలువ గల ఇండ్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపారు. వాటి కొనుగోలుకు అవసరమైన రుణాల కోసం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదించారని మ్యాజిక్ బ్రిక్స్ హోంలోన్ కన్జూమర్ సర్వే నిర్ధారించింది.
కరోనా మహమ్మారి ప్రభావంతో వర్క్ ఫ్రం హోం, లెర్నింగ్ ఫ్రం హోం కల్చర్ ఎక్కువైన తర్వాత సొంతిండ్ల కోసం డిమాండ్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతోపాటు వ్యవస్థలో నగదు చలామణి పెంచడానికి కీలక వడ్డీరేట్లను రికార్డు స్థాయిలో తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో సొంతిండ్ల కొనుగోళ్లకు రుణాలు పెరిగాయి.
వడ్డీరేట్ల తగ్గింపుతో వివిధ బ్యాంకుల మధ్య తేడాలు కూడా ఉన్నాయి. తక్కువ వడ్డీరేట్ ఇస్తున్న బ్యాంకుకు ఇంటి రుణాల బదిలీకి కూడా గిరాకీ పెరిగింది. అందులోనూ టాప్-5 సిటీల్లో హైదరాబాద్‌కు చోటు దక్కింది. ఇంకా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, పుణె నగరాల్లోనూ ఇంటి రుణాల బదిలీలు పెరిగాయి.. ఇక ద్వితీయ శ్రేణి నగరాలైన ఘజియాబాద్, మొహాలి, నోయిడా, ఇండోర్, విశాఖపట్నంల్లో ఇండ్ల రుణాల బదిలీకి డిమాండ్ ఎక్కువైంది.
అత్యధికంగా ఇండ్ల రుణాలకు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, పుణె నగరాల్లో గిరాకీ ఉంది. ద్వితీయ శ్రేణి నగరాలైన గుర్గావ్, జంషెడ్పూర్, పాట్నా, ఫరీదాబాద్, లక్నో నగరాల్లో ఎక్కువగా ఇండ్ల రుణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2020తో పోలిస్తే ఇండ్ల రుణాలకు 26 శాతం డిమాండ్ పెరిగింది. ఇక ఇండ్ల రుణాల బదిలీలో 42 శాతం గిరాకీ ఎక్కువైంది.
ఆస్తిపై రుణం (ఎల్ఏపీ)లోనూ 20 శాతం డిమాండ్ పెరిగింది. ఆర్బీఐ కీలక రెపోరేటును నాలుగు శాతం వద్దే కొనసాగిస్తుండటంతో పలు బ్యాంకులు ఏడు శాతం లోపు వడ్డీరేటుకే ఇంటి రుణాలిస్తున్నాయి. దీనివల్ల ఇండ్ల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. గతేడాది తొలి అర్ధభాగంలో ప్రథమ శ్రేణి నగరాల్లో రూ.36 లక్షల్లోపు రుణాల కోసం చాలా మంది తరుచుగా అన్వేషించారు. ద్వితీయ శ్రేణి సిటీల్లో రూ.26 లక్షల్లోపు ఇండ్ల రుణాల కోసం తరుచుగా ఎంక్వైరీలు చేశారని మ్యాజిక్ బ్రిక్స్ హోంలోన్ కన్జూమర్ సర్వే నిగ్గు తేల్చింది.
మ్యాజిక్ బ్రిక్స్ సీఈవో సుధీర్ పాయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కీలక నగరాల్లో సొంతిండ్ల కోసం డిమాండ్ పెరిగిందన్నారు. ప్రభుత్వం పలు సానుకూల నిర్ణయాలు తీసుకోవడం, ఆర్బీఐ రెపోరేట్ తగ్గించడం, స్టాంప్ డ్యూటీలో మినహాయింపు వంటి నిర్ణయాలతో గిరాకీ ఎక్కువైందన్నారు. దాదాపు 50 శాతం రుణగ్రహీతలు 15 ఏండ్ల గడువు గల రుణాలు తీసుకున్నారు.
వర్క్ ఫ్రం హోం ఒక విధానంగా మారడంతో సొంతింటి కోసం నగర వాసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇల్లు ఉంటే.. అంత కంటే పెద్ద ఇల్లు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారని ఈ సర్వే పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Spondylitis | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?
Healthy food | తరచూ ఈ స్వీట్ తింటే అస్తమా, ఎసిడిటీ దూరం కావాల్సిందే
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
ఆన్లైన్ క్లాసులతో పిల్లలకు కొత్త తంటా.. పెరుగుతున్న మెల్లకన్ను సమస్యలు
తల్లిదండ్రులకు హెచ్చరిక.. డిజిటల్ మాధ్యమాలు ఎక్కువగా వాడే పిల్లల్లో ఊబకాయం ముప్పు