తల్లిదండ్రులకు హెచ్చరిక.. డిజిటల్ మాధ్యమాలు ఎక్కువగా వాడే పిల్లల్లో ఊబకాయం ముప్పు

Obesity in Children | ఒప్పుకోక తప్పదు.. వయసుతో సంబంధం లేకుండా డిజిటల్ మీడియా ఓ వ్యసనంగా మారిపోయింది. ఆడుతూపాడుతూ చదువుకోవాల్సిన పిల్లలు టీవీ, సోషల్ మీడియా, మొబైల్ గేమ్స్ అంటూ ఏదో ఒక తెరకు అతుక్కుపోతున్నారు. దానికి తోడు ‘ఆన్లైన్ క్లాసులు’! వీటి పుణ్యమాని స్క్రీన్ టైమ్ కూడా పెరిగిపోతున్నది. దీనివల్ల సహజంగానే శరీర శ్రమ తగ్గిపోతున్నది. ఫలితం.. టీనేజ్లోనే ఊబకాయం వస్తున్నది. ఫిన్లాండ్కు చెందిన హెల్సింకీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్న మాట ఇది. దీన్ని నిరూపించేందుకు నాలుగువేల మందికి పైగా పిల్లలను ఎంచుకొన్నారు. 11 ఏండ్ల వయసులో విపరీతంగా డిజిటల్ మాధ్యమాలకు అలవాటు పడిన పిల్లల్లో 14 ఏండ్లు వచ్చేసరికి ఊబకాయపు లక్షణాలు కనిపించాయట. అయితే, ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని సూచిస్తున్నారు పరిశోధకులు. పిల్లలు కనుక రోజుకో గంట చొప్పున అలసట కలిగేలా బయట తిరిగితే.. ఊబకాయం దరిచేరదని భరోసా ఇస్తున్నారు. స్క్రీన్ టైమ్‌ను ఎలాగూ తగ్గించలేం, కనీసం శారీరక వ్యాయామాన్ని అయినా ప్రోత్సహిద్దాం!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

