బుధవారం 27 జనవరి 2021
Business - Dec 04, 2020 , 11:04:30

ఇండియాలో బెస్ట్ ఎస్‌యూవీ ఇదే

ఇండియాలో బెస్ట్ ఎస్‌యూవీ ఇదే

ముంబై: ఇండియాలో క్ర‌మంగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ)ల‌కు డిమాండ్ పెరుగుతోంది. ఆడి, బీఎండ‌బ్ల్యూ, మెర్సిడీస్‌లాంటి టాప్ బ్రాండ్లు కాక‌పోయినా.. హ్యుండాయ్‌, కియా, టాటా, మారుతిలాంటి కంపెనీల నుంచి వ‌చ్చే ఎస్‌యూవీల అమ్మ‌కాలు దేశంలో పెరుగుతున్నాయి. న‌వంబ‌ర్‌లో దేశ వ్యాప్తంగా 35 వేల ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి. వీటిలో అత్య‌ధికంగా సౌత్‌కొరియా కంపెనీలు అయిన హ్యుండాయ్‌, కియాకు చెందిన కార్లే ఉండ‌టం విశేషం. అందులోనూ హ్యుండాయ్ క్రెటా నవంబ‌ర్‌లో బెస్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. గ‌త నెల‌లో మొత్తం 12,017 క్రెటా ఎస్‌యూవీలు అమ్ముడుపోయిన‌ట్లు తాజా లెక్క‌లు తేల్చాయి. అక్టోబ‌ర్‌లోనూ క్రెటా 14,023 అమ్మ‌కాల‌తో టాప్ ప్లేస్‌లో ఉండ‌టం విశేషం. ఇక రెండోస్థానంలో కియా మోటార్స్‌కు చెందిన సెల్టోస్ ఎస్‌యూవీ నిలిచింది. గ‌తేడాది ఆగ‌స్ట్‌లో రిలీజైన ఈ మోడ‌ల్‌.. న‌వంబ‌ర్‌లో 9,205 అమ్మ‌కాల‌తో రెండోస్థానంలో ఉంది. అక్టోబ‌ర్‌లో కియా 8900 సెల్టోస్ కార్ల‌ను విక్ర‌యించింది. ఇక మూడోస్థానంలో మ‌హేంద్ర‌ స్కార్పియో (3725), నాలుగోస్థానంలో ఎంజీ మోటార్స్‌కు చెందిన హెక్టార్ ఎస్‌యూవీ (3426), ఐదో స్థానంలో మారుతి సుజుకీ ఎస్‌-క్రాస్ (2877) నిలిచింది. 


logo